పిల్లలతో తండ్రులు కచ్చితంగా చూడాల్సిన సినిమాలు ఇవి...!

First Published | Apr 11, 2024, 11:18 AM IST

ఏవేవో సినిమాలు కాకుండా.. కచ్చితంగా పిల్లతో కలిసి చూడాల్సిన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి..? ఈ సినిమాలు మాత్రమే ఎందుకు చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పుడు తండ్రులు.. తమ పిల్లలతో సరిగా ఉండేవారు కాదు. ఎక్కడ ప్రేమ చూపిస్తే.. పిల్లలు పాడైపోతారో అని భయపడేవారు. అందుకే...క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు.  కానీ.. ఈకాలం తండ్రులు అలా కాదు. పిల్లలతో చాలా సరదాగా ఉంటున్నారు. సినిమాలకు, షికార్లకు కూడా తీసుకొని వెళతారు. అయితే.. సినిమాలు అంటే.. ఏవేవో సినిమాలు కాకుండా.. కచ్చితంగా పిల్లతో కలిసి చూడాల్సిన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి..? ఈ సినిమాలు మాత్రమే ఎందుకు చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

The Lion King

1.the lion king

ది లయన్ కింగ్. ఈ సినిమా పిల్లలు అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అది కూడా.. తండ్రితో కలిసి పిల్లలు చూడాల్సిన సినిమా ఇది. సింహం సినిమా అయినా.. తండ్రి, కొడుకుల అనుబంధం బాగా చూపిస్తారు. తండ్రి సింహం ముసాఫా తన కొడుకు సింబా కి  ఇతరులను ఎలా గౌరవించాలి అనే విషయాన్ని నేర్పుతాడు. తండ్రి నేర్పిన విలువలను సింబా పాటిస్తాడు.
 



2.Kung fu panda
కుంగ్ ఫూ పాండా మూవీ కూడా  పిల్లలను చాలా ఎక్కువగా నచ్చేస్తుంది. అయితే.. ఈ మూవీని తండ్రితో కలిసి చూడాలి. ఇందులో...  మిస్టర్ పింగ్ తన కొడుక్కి చాలా విషయాలు నేర్పిస్తాడు.  ఏదైనా ప్రత్యేకంగా చేయాలంటే అది ప్రత్యేకమైనదని మీరు నమ్మాలి అనే విషయం నేర్పుతాడు. ఇది మనం కూడా ఈ కాలం పిల్లలకు ముఖ్యంగా తండ్రి నేర్పించాల్సిన అవసరం ఉంది.

3.the Princess and Frog
పిల్లలు కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ది ప్రిన్సెస్ అండ్ ఫ్రాగ్ కూడా ఒకటి. ఈ మూవీలో జేమ్స్.. తన కూతురు టియానాకు  హార్డ్ వర్క్ ప్రాముఖ్యతను వివరిస్తారు. మీరు కూడా మీ పిల్లలతో ఈ మూవీ చూసి..ఆ మూవీలోని ముఖ్యాంశాన్ని వివరించాలి.
 

The Incredibles

4.The Incredibles
ఇక.. ప్రతి తండ్రి.. తమ పిల్లలో కచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. ఈ మూవీలో తండ్రి.. తమ పిల్లలను ప్రతి విషయంలోనూ అప్రిషియేట్ చేస్తూనే ఉంటాడు. దాని వల్ల.. పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుతుందో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు.

5.Hercules
ఈ మూవీలో zues తన కుమారుడు  Hercules కి చాలా మంచి విషయం నేర్పిస్తాడు. శారీరక బలం కంటే... మన దయ, కంపాషన్ తోనే నువ్వు హీరో అవ్వగలవు అని నేర్పిస్తాడు. మనం కూడా మన పిల్లలకు.. ఆ ఆత్మస్థైర్యాన్ని అందించాలి.

Latest Videos

click me!