Parenting Tips: పిల్లలు తొందరగా నిద్రపోవాలా? ఇలా చేస్తే చాలు

పిల్లలకి సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం, ఇది వారి ఆరోగ్యం, చదువు, మానసిక శాంతికి అవసరం. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, కథలు చెప్పడం, తేలికపాటి ఆహారం ఇవ్వడం, ప్రేమగా వ్యవహరించడం వల్ల నిద్ర అలవాటు బాగా ఏర్పడుతుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే పిల్లల నిద్ర సమస్యలు తేలికగా తగ్గిపోతాయి.

essential sleep tips for child development in telugu ram

ఇప్పటి బిజీ లైఫ్‌స్టైల్‌లో పిల్లల్ని సమయానికి పడుకోబెట్టడం ఓ ఛాలెంజ్‌గానే మారింది. స్కూల్‌ నుంచి హోం వర్క్‌, ఆటలు, టీవీ, మొబైల్‌ ఇలా నిత్యం వారిదైన శెడ్యూల్‌ నిండిపోయి ఉంటుంది. దాంతో ప్రతిరోజూ రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. కానీ ఇది శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేస్తుంది. సరైన నిద్ర పిల్లల ఆరోగ్యానికి ఎంతగానో అవసరం. మంచి నిద్ర ఉన్నప్పుడే పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది. వారి ఫోకస్ కూడా పెరుగుతుంది. మరి.. పిల్లలను సులభంగా టైమ్ కి నిద్రపుచ్చాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

essential sleep tips for child development in telugu ram

ఇక్కడ పిల్లలకి మంచి నిద్ర అలవాట్లు వచ్చేలా కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి:

1. ఒకే టైం ఫిక్స్ చేయండి
పిల్లల నిద్రకి క్రమం చాలా ముఖ్యం. ప్రతి రోజు ఒకే టైంకి పడుకోవడం, ఒకే టైంకి లేవడం అలవాటు చేయండి. ఉదాహరణకి, రాత్రి 9కి పడుకోవడం, ఉదయం 6:30 లేదా 7కి లేవడం. దీనివల్ల వాళ్ల శరీర గడియారం (బయోలాజికల్ క్లాక్‌) సెట్ అవుతుంది. ఇలా చేస్తే శరీరం స్వయంగా ఆ టైంకి నిద్ర కోసం సిగ్నల్స్ పంపుతుంది.


2. మొబైల్‌, టీవీకి 'గుడ్ నైట్' చెప్పించండి
నిద్రకి ముందు స్క్రీన్ టైం చాలా హానికరం. మొబైల్‌, టీవీ, టాబ్లెట్ వాడితే పిల్లల మెదడు స్టిమ్యులేట్ అవుతుంది. అందుకే పడుకునే ముందు కనీసం గంట సేపు స్క్రీన్‌కి దూరంగా ఉండాలి. ఇది మైండ్‌ను కూల్‌గా ఉంచి నిద్ర త్వరగా రావడానికి సహాయపడుతుంది.

Babies sleeping on bed

3. కథలతో కలల ప్రపంచంలోకి తీసుకెళ్లండి
నిద్రకు ముందు చిన్న కథ చెప్పడం పిల్లల మనస్సును సానుకూలంగా మారుస్తుంది. పెద్దగా డైలాగ్లు లేకపోయినా, ప్రేమగా కూర్చుని ముద్దు పెట్టి చిన్న చిన్న కథలు చెప్పండి. ఆ హాయిగా ఆడే తండ్రి/తల్లి స్వరం పిల్లల్ని సేఫ్‌గా ఫీల్ చేయిస్తుంది. వాళ్ళలో భయం, ఉద్వేగం తగ్గించి నిద్ర తేలికగా రానిస్తుంది.

4. తేలికపాటి ఆహారం 
రాత్రి భోజనం ఎప్పుడూ తేలికగా ఉండాలి. హెవీగా ఆహారం తీసుకోవడం వల్ల  నిద్రలో అంతరాయం కలుగుతుంది. ఆకలితో కూడా పిల్లలు ఏడుస్తారు. అందుకే పడుకునే ముందు కొద్దిగా పాలూ, లేదా తేలికపాటి డిన్నర్‌ ఇవ్వండి. ఇది శరీరాన్ని సడలించి నిద్రకి అనుకూలంగా చేస్తుంది.

sleeping

5. కరక్తివ్‌గా కాకుండా ప్రేమగా అర్థం చేయించండి
కొందరు పిల్లలు నిద్రకి వెళ్దామని చెప్పగానే కోపంగా రెస్పాండ్ అవుతారు. అలాంటప్పుడు వారిని మందలించకండి. బదులుగా ప్రేమగా, వాటిని ఆహ్లాదంగా మార్చండి. ప్రేమగా దగ్గర తీసుకొని, కథల గురించి ప్రస్తావిస్తూ  వారిని కూల్ చేయాలి. 

ఫైనల్‌గా...
పిల్లలకి నిద్రంటే భయంగా కాకుండా, హాయిగా అనిపించాలి. ప్రేమ, పద్ధతి, పాటించదగిన రొటీన్‌తో మీరు ఈ పని సులభంగా చేయవచ్చు. వాళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా, శ్రద్ధగా ఎదగాలని మనం కోరుకుంటే, మొదట వారికి హాయిగా నిద్రపోవడం నేర్పించాలి

Latest Videos

vuukle one pixel image
click me!