ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆఫీసుకు వెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి

First Published Dec 10, 2023, 10:28 AM IST

ప్రెగ్నెన్సీ టైంలో ఆఫీసుకు వెళ్లడం, ఒకేదగ్గర గంటల తరబడి కూర్చుని వర్క్ చేయడం కష్టంగా ఉంటుంది. చాలాసార్లు పనికి, ఆరోగ్యానికి మధ్య సరైన సమన్వయం ఉండదు. ఎక్కువ సేపు పని చేస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదంలో పడుతుంది. అందుకే పనిచేసే గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

pregnancy

ప్రెగ్నెన్సీ అనుభవం ప్రతి మహిళకు భిన్నంగా ఉంటుంది. కానీ వర్క్ చేసే గర్బిణులకు దాదాపుగా ఒకేరకమైన సమస్యలు కలుగుతాయి. వీటిని లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవి మిమ్మల్ని, మీ బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రసవం తర్వాత ప్రసూతి సెలవులకు ఆప్షన్ ఉన్నప్పటికీ ప్రసవానికి ముందు అలాంటి సదుపాయం లేకపోవడంతో కొంతమంది మహిళలు కొన్నిసార్లు 9వ నెల వరకు కూడా ఆఫీసుకు వెళ్తుంటారు. అయితే మీరు కూడా ఇలాగే వర్క్ చేస్తున్నట్టైతే మీ ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

pregnancy

1. ఆఫీసుకు మీరే డ్రైవ్ చేసుకుంటూ వెళతారా? రెండో నెల వరకు ఇలా వెళ్లొచ్చు. కానీ మూడో త్రైమాసికంలో ఇలా చేయడం మంచిది కాదు. డ్రైవింగ్ చేయడం వల్ల ఎన్నో అసౌకర్యాలు కలుగుతాయి. అలాగే మీరు ఒక్కరే ప్రయాణించడం సేఫ్ కాదు. అందుకే ఇలాంటి సమయంలో మీరు ఒక డ్రైవర్ ను నియమించడం లేదా ఇంటి వాళ్లను ఆఫీసుదాకా తీసుకెళ్లడం మంచిది. 

2. రద్దీగా ఉండే పబ్లిక్ ప్లేస్ లో వెళ్లడాన్ని తగ్గించండి. దీంతో మీరు ఒత్తిడికి గురికావాల్సిన అవసరం ఉండదు. 

pregnancy

3. మీ ఇంటికి, ఆఫీసుకు మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్టైతే మధ్యలో టీ, కాఫీలను తాగడం మానుకోండి. ఎందుకంటే దీనివల్ల మీరు పదే పదే టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుంది. దారిలో వేరే మార్గం లేకపోతే టాయిలెట్ ఆపాల్సి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. 

4. ఆఫీసులో వికారంగా, వాంతులు వచ్చినట్టుగా అనిపిస్తే అల్లం, నిమ్మకాయను వెంట ఉంచుకోండి.
 

5. ఎక్కువ సేపు సీట్లో కూర్చోకండి. అప్పుడప్పుడూ సీట్లోంచి లేచి నడుస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది. అలాగే కాళ్లలో రక్త ప్రసరణ కూడా సక్రమంగా ఉంటుంది. కాళ్ల వాపు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

6. మీతో పాటుగా పండ్లు, నట్స్, ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తీసుకెళ్లండి. 


ఈ పని చేయొద్దు

1. ఖాళీ కడుపుతో అంటే ఏమీ తినకుండా ఆఫీసుకు వెళ్లకూడదు. ఇది మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. అలాగే మీ కడుపులో ఉన్న మీ బిడ్డ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. 

2. గర్భదాల్చిన మూడో త్రైమాసికంలో కంఫర్టబుల్ కుర్చీలోనే కూర్చోండి. దీనివల్ల మీరు కింద పడిపోయే ప్రమాదం ఉండదు. అలాగే మీరు కాళ్లు వేలాడదీసి ఎక్కువ సేపు కూర్చోకూడదు. పాదాలకు మద్దతు ఇవ్వడానికి కుర్చీ కింద ఒక స్టూల్ ను పెట్టండి. దీంతో పాదాల్లో వాపు వచ్చే సమస్య ఉండదు. 

3. అలాగే చెకప్ లు టైం టూ టైం చేయించుకోవాలి. ఎలాంటి సమస్య ఉన్నా డాక్టర్ కు నిర్మొహమాటంగా చెప్పేయాలి. 

4. ఆఫీసులో మైకంగా, వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తే సహాయం తీసుకోండి. బలవంతంగా పని చేయకండి. 
 

click me!