Parenting tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులే పిల్లలు చెడిపోవడానికి కారణం!

Published : Feb 28, 2025, 02:36 PM IST

తల్లిదండ్రులకు పిల్లలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. ఉదయం లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు పేరెంట్స్.. పిల్లల కోసం ఎన్నో చేస్తారు. వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు చేసే కొన్నిపనులు, అలవాట్ల వల్ల పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
Parenting tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులే పిల్లలు చెడిపోవడానికి కారణం!

పిల్లలు ఎక్కువశాతం తల్లిదండ్రులతోనే ఉంటారు. కాబట్టి వారి ప్రవర్తన తల్లిదండ్రులతో ముడిపడి ఉంటుంది. పిల్లలు ఏం చేస్తారు? భవిష్యత్తులో ఎలా ఉంటారు అనే విషయాలు తల్లిదండ్రుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి. తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పుల వల్ల పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. అవెంటో ఇక్కడ చూద్దాం.

25
గట్టిగా మాట్లాడొద్దు

తల్లిదండ్రులు పిల్లల ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. పిల్లల ముందు ఎవరితోనూ గట్టిగా మాట్లాడకండి. ఇలా చేయడం వల్ల, వారు దానిని సాధారణంగా భావించడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వారు కూడా గట్టి గట్టిగా మాట్లాడటం, అరవడం స్టార్ట్ చేస్తారు.

35
చెడ్డ మాటలు మాట్లాడవద్దు

పిల్లలు ఏ విషయమైనా ఎక్కువశాతం తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారంటే, వారి ముందు తల్లిదండ్రులు గాని ఇంట్లో ఇతర వ్యక్తులు గాని అలా మాట్లాడటం వల్ల వారు అవి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు చెడ్డ పదాలను మాట్లాడకుండా ఉండటం మంచిది.

45
పట్టుబట్టి అడిగినవి కొనివ్వకండి!

పిల్లలు బలవంతం చేసి లేదా మారం చేసి ఏదైనా అడిగితే వెంటనే కొనివ్వకండి. అది మంచి అలవాటు కాదు. ఒకవేళ మీరు కొనిస్తే కాలక్రమేణా ఆ అలవాటుతో వారు చాలా మొండిగా తయారవుతారు. అడిగిందల్లా కచ్చితంగా కొనివ్వాలని పట్టుబడుతారు. కాబట్టి వారికి అవసరమైనవి, అవసరమైన సమయంలో కొనివ్వడం ఉత్తమం.

55
డబ్బు వృథా:

డబ్బును వృథా చేయడం చెడ్డ అలవాట్లలో ముందు వరుసలో ఉంటుంది. ఈ అలవాటు మీకు మాత్రమే కాదు మీ పిల్లలకు కూడా హాని కలిగిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలకు పొదుపు ఎలా చేయాలో చిన్నప్పటి నుంచే నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. అప్పుడే వారికి డబ్బు విలువ అర్థమవుతుంది.

click me!

Recommended Stories