kids room
చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లలకు ఎందులోనూ ఆసక్తి ఉండటం లేదు.. ముఖ్యంగా చదవడం అంటే మరీ నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఫీలౌతూ ఉంటారు. మీ పిల్లలు కూడా ఇదే కోవలోకి వస్తున్నారా..? అయితే.. వారిని నిత్యం జీవితంలో ఏదో ఒకటి సాధించాలనో, ఆసక్తి పెంచేలాగో.. వాళ్ల కళ్ల ముందు కనపడేలా చేయాలి. అప్పుడు ఆటోమెటిక్ వారికి కూడా.. దానిపై ఆసక్తి పెరుగుతుంది.
పిల్లలు ఎక్కువగా ఉండేది ఇంట్లోనే కాబట్టి.. ఇంటి వాల్స్ ని వారిలో ఆసక్తి పెంచేలా డిజైన్ చేయవచ్చు. మరీ వాల్ పేపర్ గా కాకపోయినా.. గదిలో మఖ్యంగా పిల్లల గదిలో, వాళ్ల స్టడీ రూమ్ లో వాల్ స్టిక్కర్స్ గా అంటించడం వల్ల వారిలో ఆసక్తి, పెంచొచ్చు. మరి ఎలాంటి స్టిక్కర్స్ ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం..
1.వరల్డ్ మ్యాప్..
ఇండియా మ్యాప్ వరకు అంటే.. ఏ రాష్ట్రం ఎక్కడ ఉంటుందో పిల్లలకు బాగానే గుర్తుంటుంది. కానీ.. వరల్డ్ మ్యాప్ తో వాల్ స్టిక్కర్ పిల్లల స్టడీ రూమ్ లో అంటించండి. ఇది భౌగోళిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో పిల్లలకు సహాయపడుతుంది. ప్రపంచ పటం మాత్రమే ప్రపంచంలోని ఏ దేశంలో ఏ ప్రదేశంలో ఉందో సమాచారాన్ని అందిస్తుంది. అందువల్ల ప్రతి విద్యార్థి జీవితంలో ఇది చాలా ముఖ్యమైన అంశాలలో ఒకటిగా పరిగణిస్తారు. మీ పిల్లలకు కూడా ఇది కచ్చితంగా ఆసక్తి పెంచే అవకాశం ఉంది. ప్రయత్నించి చూడండి.
kids room
2.సక్సెస్ మంత్రా కోట్స్..
చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు.. మంచి స్పూర్తినిచ్చే వ్యాఖ్యలు చెబుతూ ఉంటారు.వాటిలో సక్సెస్ కి సంబంధించిన వాటిని ఎంచుకొని వాటిని పిల్లల రూమ్ లో పెట్టండి. పిల్లలకు ఎదురుగా కంటికి కనిపించేలా దానిని పెట్టడం మర్చిపోవద్దు. ఆ సూక్తులు చదివిన ప్రతిసారీ.. ఏదో ఒకటి సాధించాలి అనే కసి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ప్రయత్నించి చూడండి.
Mathematics
3.మ్యాథ్స్ ఫార్ములా వాల్ ఆర్ట్..
పిల్లల స్టడీ రూమ్ లో మ్యాథ్స్ ఫార్ములాకు సంబంధించిన వాల్ పోస్టర్లు, వాల్ స్టిక్కర్లు ఏవైనా అంటించొచ్చు. మ్యాథ్ ఫార్ములాలు గుర్తుంచుకునేలా చేయడంలోనూ హెల్ప్ చేస్తాయి. పిల్లల్లో మ్యాథ్స్ పై ఆసక్తి పెంచడానికి సహాయపడతాయి.