Crying baby
చాలా మటుకు పిల్లల్ని తల్లిదండ్రులు తెగ గారాబం పెట్టేస్తుంటారు. కానీ అతి గారాబం పిల్లలకు అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది పిల్లల్ని మొండిగా, మరింత సున్నితంగా చేస్తుంది. అయితే కొంతమంది పిల్లలు ఊరికే ఏడుస్తుంటారు. ఏది కొనియ్యకపోయినా, లేదా పక్క వాళ్లు తిట్టారని, హోం వర్క్ చేయలేదని, ఏదో వస్తువు కిందపడిపోయిందని, కిందపడ్డారని ఇలా ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుంటారు. కానీ ఇది మీ పిల్లల్ని బలహీనంగా చేస్తుంది. అందుకే మీ పిల్లల్ని దృఢంగా మార్చడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ చిట్కాలు మీ పిల్లలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎలా ఎదుర్కొనేలా చేస్తాయి.
Crying baby
చెప్పేది వినండి
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏదేదో మాట్లాడుతారని, బుర్ర తింటారని అనుకుంటారు. అందుకే పిల్లల మాట అస్సలు వినరు. కానీ పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు ఖచ్చితంగా వినాలి. ఇది పిల్లలకు చాలా అవసరం.మీరు వారి మాట వింటే.. వారికి ఒక ధైర్యం కలుగుతుంది. ఇది మీ పిల్లల్ని బలంగా చేస్తుంది.
ప్రశంస
పిల్లలు చెడు పనులు చేసినప్పుడు, మాట్లాడినప్పుడు కొట్టడమో, తిట్టడమో, మందలించడమో ఖచ్చితంగా చేస్తుంటారు. కానీ పిల్లలు ఏదైనా మంచి చేసినప్పుడు మాత్రం పొగడరు. ఇది మీ పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మీ పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు వెంటనే ప్రశంసించండి. ఇలా చేస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పండి
మీ పిల్లలకు ఏదైనా సమస్యలు వస్తే వారికి దాని నుంచి ఎలా బయటపడాలో నేర్పించండి. ఇది వాళలు తమను తాము పూర్తిగా నమ్మడం నేర్చుకోవడానికి సహాయపడుతుంది. అలాగే వారి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
భావాల గురించి మాట్లాడండి
ప్రతి ఒక్కరికీ భిన్నమైన భావాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసినా.. వాటి గురించి మాత్రం పట్టించుకోరు. ముఖ్యంగా పిల్లల విషయంలో. అందుకే పిల్లల భావాలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వాటి గురించి పిల్లలకు చెప్పాలి. అప్పుడే పిల్లలు వారి స్వంత, ఇతరుల భావాలను అర్థం చేసుకుంటారు.