ఆడపిల్లలకు పేరెంట్స్ అస్సలు చెప్పకూడనివి ఇవే..!

Published : Dec 10, 2024, 03:23 PM IST

  ఆడపిల్లలను పెంచే విషయంలో పేరెంట్స్ చాలా ఓర్పుతో ఉండాలట. వారికి అస్సలు చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..  

PREV
15
ఆడపిల్లలకు పేరెంట్స్ అస్సలు చెప్పకూడనివి ఇవే..!

 

ప్రతి పేరెంట్స్ తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని, వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. వారికి చిన్నతనం నుంచే చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటారు. అయితే.. పిల్లలకు  చిన్నతనం నుంచే కచ్చితంగా నేర్పించాల్సిన కొన్ని విషయాలు ఉంటే… వారికి పొరపాటున కూడా చెప్పకూడనివి కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం…

 

పిల్లలకు చిన్నతనం నుంచే లింగ సమానత్వం గురించి నేర్పించాలట. కేవలం ఆడపిల్లలకే కాదు, మగ పిల్లలకు లింగ సమానత్వం గురించి నేర్పించాలి. ముఖ్యంగా ఆడపిల్లలను పెంచే విషయంలో పేరెంట్స్ చాలా ఓర్పుతో ఉండాలట. వారికి అస్సలు చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

 

25

 

ఇది అమ్మాయిల పని కాదు…

 

లింగం ఆధారంగా పనిని  డివైడ్ చేయకూడదు.  ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పనిని చేసే అవకాశం కల్పించాలి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఏదైనా కెరీర్ ని ఎంచుకుంటే అది అమ్మాయిల పని కాదు అని వారిని నిరాశపరచకూడదు. అది ఎలాంటి కెరీర్ అయినా వారిని ప్రోత్సహించండి. 

 

35
girl child day

 

అమ్మాయిల బరువు…

ఇంట్లో ఆడపిల్లలు కాస్త బరువు పెరిగితే..వారిని విమర్శించడం కరెక్ట్ కాదు. ఆడపిల్లలు అంత బరువు ఉండకూడదు.. ఇంతే ఉండాలి ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. కాకపోతే..ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడండి. మీ కుమార్తె లావుగా ఉందని ఆటపట్టించడం ద్వారా ఆమెను నిరాశకు గురిచేయవద్దు.

 

ఈ పని నువ్వు చేయలేవు….

ఈ పని నువ్వు చేయలేవు చెప్పి అమ్మాయిల సామర్థ్యాలను కించపరచకండి. ఇది తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు. అమ్మాయిలు దేనిపై ఆసక్తి చూపుతున్నారో తెలుసుకోండి, వారిని ప్రోత్సహించండి.వారి కలలను కొనసాగించడానికి వారిని అనుమతించండి. కుదరదని చెప్పి వారిని బాధపెట్టకండి.

 

45

 

అమ్మాయిల దుస్తులు..

అమ్మాయిలు జీన్స్, షర్టులు వేసుకుంటే నేరం కాదు. వారికి నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. 

 

మీ కుమార్తె తన మనసులోని మాటను చెప్పడానికి అనుమతించండి. ఆడపిల్లలకు తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది.

 

 

 

55

గట్టిగా నవ్వడం…

ఇంట్లో ఆడపిల్లలు గట్టిగా నవ్వితే… అది పెద్ద తప్పు అయినట్లు.. ఆడపిల్లలు అలా నవ్వకూడదు అని చాలా మంది చెబుతుంటారు. కానీ.. అలా చెప్పడం తప్పు. వారికి నచ్చినట్లు నవ్వే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి.

click me!

Recommended Stories