40ఏళ్ల తర్వాత గర్భం దాలిస్తే ఏమౌతుంది?

Published : Dec 07, 2024, 03:16 PM ISTUpdated : Dec 07, 2024, 03:39 PM IST

   40 ఏళ్ల పిల్లలను కనవచ్చా? కంటే ఏమౌతుంది? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…   

PREV
15
40ఏళ్ల తర్వాత గర్భం దాలిస్తే ఏమౌతుంది?


ఈ రోజుల్లో చాలా మంది మహిళలు పెళ్లి కంటే.. తమ కెరీర్ కే ఎక్కువ  ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో.. పెళ్లిళ్లే చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. చాలా మంది మహిళలు 40 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. నిజంగా ఇలా 40 ఏళ్ల పిల్లలను కనవచ్చా? కంటే ఏమౌతుంది? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం… 


 

25


ఈ మధ్యకాలంలో చాలా మంది 40 దాటిన తర్వాత పిల్లలను కంటున్నారు. నిజానికి ఈ వయసులో పిల్లలకు జన్మనివ్వడం వల్ల లాభాలు కూడా ఉన్నాయట. ఈ వయసులో పేరెంట్స్ కి ఓపిక ఎక్కువగా ఉంటుంది. మెచ్యురిటీ కూడా ఉంటుంది. ఆ సమయానికి కెరీర్ లో కూడా మంచి స్థానానికి చేరుకుంటారు. డబ్బు విషయంలో బాధ ఉండదు. పిల్లలకు అవసరమైవన్నీ అందించే స్థాయిలో ఉంటారు. కానీ, నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. 

40ఏళ్ల వయసులో పిల్లలను కనడం చాలా సవాలుగా ఉంటుంది. అసలు గర్భం దాల్చడమే చాలా కష్టం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన వయసు పెరిగే కొద్దీ సహజంగానే సంతానోత్పత్తి తగ్గుతుంది. ముఖ్యంగా 35ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం  చాలా కష్టం అవుతుంది.  సహజంగా గర్భం దాల్చలేక ఐవీఎఫ్ వంటి పద్దతుల సహాయం తీసుకోవాల్సిన అవసరం రావచ్చు.

 

35

ఒకవేళ ఏదో ఒక పద్దతిలో గర్భం దాల్చినా.. చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందట. 

మధుమేహం, అధిక రక్తపోటు..

40 దాటిన తర్వాత గర్భం దాల్చేవారిలో మధుమేహం సమస్య చాలా కామన్ గా ఎదురౌతుంది. అలాంటి సమయంలో వారు తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.  అంతేకాదు..  డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన పరిస్థితుల సంభావ్యత వయస్సుతో పెరుగుతుందని వైద్యులు  చెబుతున్నారు. 

 

45


ముందస్తు జననం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం..


వైద్యుల ప్రకారం.. 40 తర్వాత గర్భం దాల్చడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవం లేదా తక్కువ బరువుతో జననానికి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. గర్భధారణ సమయంలో, బిడ్డ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి సాధారణ ప్రినేటల్ చెకప్లు, స్క్రీనింగ్లు అవసరం. జన్యు పరీక్ష లేదా అమ్నియోసెంటెసిస్ వంటి అధునాతన రోగనిర్ధారణ సాధనలు సంభావ్య ప్రమాదాలను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి.

 

55

 

ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం కూడా చాలా అవసరం. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ తల్లి , బిడ్డ శ్రేయస్సుకు సహాయపడుతుంది.  ధూమపానం, మద్యం, ఇతర హానికరమైన పదార్ధాలను దూరంగా ఉంచడం చాలా అవసరం.


 

click me!

Recommended Stories