3. అధిక స్క్రీన్ టైమ్, మొబైల్ గేమ్స్
మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు లేదా టీవీల ముందు గంటల కొద్దీ గడపడం మెదడుకు "స్లో పాయిజన్" లాంటిది. మొబైల్ గేమ్స్ ఆడటం వల్ల మెదడులో 'డోపమైన్' అనే హార్మోన్ విడుదలవుతుంది, దీనివల్ల పిల్లలు వాటికి బానిసలవుతారు. ఇది వారి ఆలోచనా శక్తిని తగ్గించి, సహనం (Patience) లేకుండా చేస్తుంది. కళ్ళు , మెదడు రెండూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి.
4. సరైన నిద్ర లేకపోవడం
మెదడు తనను తాను రీఛార్జ్ చేసుకునే సమయం నిద్రలోనే. అందుకే.. పిల్లలకు సరైన నిద్ర కచ్చితంగా అందించాలి.
పిల్లలకు రోజుకు కనీసం 8 నుండి 10 గంటల గాఢనిద్ర లేకపోతే, మెదడు కణాలు అలసటకు గురవుతాయి. దీనివల్ల చదివిన విషయాలు గుర్తుండవు, మెదడు చురుగ్గా పని చేయదు. నిద్రలేమి వల్ల పిల్లల్లో చిరాకు, కోపం పెరుగుతాయి.
5. శారీరక శ్రమ లేకపోవడం
కేవలం ఇంట్లోనే కూర్చుని ఆడుకోవడం వల్ల మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. వ్యాయామం లేదా ఆటలు లేకపోవడం వల్ల మెదడు మొద్దుబారిపోతుంది (Brain Fog). శారీరక శ్రమ ఉన్నప్పుడే మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి, కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది.