రాజకీయాల్లోకి యువ‌ర‌క్తం రావాలి.. ప్రధాని మోడీ పిలుపు

First Published | Aug 15, 2024, 10:32 AM IST

Independence Day 2024 : భారత దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ‌ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. రాజకీయాల్లోకి కొత్త ర‌క్తం రావాల‌నీ,  యువత దేశసేవకు తరలిరావాలని పిలుపునిచ్చారు. మ‌రీ ముఖ్యంగా రాజకీయ కుటుంబ నేపథ్యం లేని యువకులు  రావాలన్నారు. 
 

Independence Day 2024 : ఎంతో మంది త్యాగ‌ధ‌నుల పోరాటంతో సాధించుకున్న స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల‌తో భార‌త్ ముందుకు సాగుతోంది. దేశం కోసం చేసినవారి త్యాగ‌ల‌ను త‌ల‌చుకుంటూ యావ‌త్ భార‌తావ‌ని నేడు ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు జరుపుకుంటోంది. దేశ 78వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు దేశ‌వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు.

pm modi

భార‌త జాతీయ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన త‌ర్వాత‌  దేశ ప్రజలను ఉద్దేశించి ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అసంఖ్యాక సైనికులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనంద‌రిపై ఉందన్నారు. వారి పోరాటం, త్యాగాలు ఎప్ప‌టికీ వ‌రువ‌లేనివ‌ని గుర్తుచేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని వయనాడ్‌లోని కేలారాలో జరిగిన దుర్ఘటనపై కూడా మాట్లాడారు.. 'ఈ ఏడాది కూడా ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యంలో చాలా మంది కుటుంబ సభ్యులు, ఆస్తులు కోల్పోయారు. యావ‌త్ దేశం వారికి అండ‌గా ఉంటుంది.. బాధిత  కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

Latest Videos


అలాగే, తమ ప్రభుత్వం చేపట్టిన భారీ సంస్కరణల కారణంగా భారతీయ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత పటిష్టంగా ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. "గ‌త బ్యాంకింగ్ రంగం పరిస్థితిని గుర్తుచేసుకోండి.. వృద్ధి లేదు, విస్తరణ లేదు, విశ్వాసం లేదు.. మన‌ బ్యాంకులు కఠినమైన ప‌రిస్థితుల‌ను  ఎదుర్కొన్నాయి. బ‌ల‌మైన‌ బ్యాంకును నిర్మించడానికి మేము పెద్ద సంస్కరణలను తీసుకువ‌చ్చాము. దీంతో ఈ రంగం బలంగా ఉంది.  దాని కారణంగా సంస్కరణలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని బలమైన బ్యాంకుల్లో మన బ్యాంకులు ఉన్నాయి" అని మోడీ అన్నారు.

Narendra Modi

విద్యా వ్య‌వ‌స్థ‌లో కూడా పెద్ద మార్పులు తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో భారతదేశంలోని వైద్య కళాశాలల్లో 75,000 కొత్త సీట్లు వ‌స్తాయ‌న్నారు. విక్షిత్ భారత్ 2047 కోసం "స్వస్త్ భారత్' కావాలి, ఇందుకోసం రాష్ట్రీయ పోషణ్ మిషన్‌ను ప్రారంభించాం" అని ప్రధాని మోడీ అన్నారు. దేశ రాజ‌కీయాల్లోకి యువ‌ర‌క్తం రావాల‌ని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి. దీని కోసం లక్షల‌ మంది యువత దేశ సేవకు రావాలి. మ‌రీ ముఖ్యంగా రాజకీయేతర కుటుంబ నేపథ్యాలు నుంచి యువ‌త దేశ సేవ కోసం రాజ‌కీయాల్లోకి రావాల‌ని ప్ర‌ధాన మోడీ యువ‌త‌కు పిలుపునిచ్చారు. 

click me!