First Indipendece day రోజు నెహ్రూ ఎంత పని చేశాడో తెలుసా?

First Published | Aug 15, 2024, 7:04 AM IST

మన దేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందినప్పటికీ, అది ఏమాత్రం సునాయాసంగా రాలేదు. బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛను సాధించడానికి లక్షలాది మంది భారతీయులు తమ ప్రాణాలను అర్పించారు. వేలాది మంది ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతూ తమ జీవితాలను త్యాగం చేశారు.

1947.. మన తొలి స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశమంతా ఎంతో గర్వంగా, గొప్పగా జరుపుకోవాలని దేశమంతా భావించింది. త్యాగజీవుల స్మరణలో, స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్న భారతావని పూర్తి స్వతంత్రత నడుమ అంబరాన్నంటేలా వేడుకలు జరుపుకునేందుకు ప్రజలంతా ఉత్సాహంతో ఉన్నారు. అయితే, మన దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఏం చేశారో తెలుసా? ఈ విషయమే చాలా మందిలో అంటే స్వాతంత్య్ర సమర యోధులు, దేశ భక్తులను ఆగ్రహానికి గురిచేసింది. ఆ సంఘటన ఏంటంటే? 

భారత మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ లాంటి నాయకులు బ్రిటిష్ అధికారులు మౌంట్‌బాటన్ లాంటివారితో కలిసి పనిచేయడం అనివార్యమైంది. ఈ సమయంలో, కొత్తగా ఏర్పడుతున్న స్వతంత్ర భారతదేశం అంతర్జాతీయ సంతోషాన్ని, శాంతిని చాటడానికి ప్రయత్నించింది.

మన దేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందినప్పటికీ, అది ఏమాత్రం సునాయాసంగా రాలేదు. బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛను సాధించడానికి లక్షలాది మంది భారతీయులు తమ ప్రాణాలను అర్పించారు. వేలాది మంది ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతూ తమ జీవితాలను త్యాగం చేశారు. సుదీర్ఘ పోరాటం అనంతరం భారత్‌కు బ్రిటిష్‌ పాలన నుంచి స్వేచ్ఛ లభించింది. 

ఈ క్రమంలో, భారత మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ లాంటి నాయకులు బ్రిటిష్ అధికారులు మౌంట్‌బాటన్ లాంటివారితో కలిసి పనిచేయడం అనివార్యమైంది. ఈ సమయంలో, కొత్తగా ఏర్పడుతున్న స్వతంత్ర భారతదేశం అంతర్జాతీయ సంతోషాన్ని, శాంతిని చాటడానికి ప్రయత్నించింది.
 


త్రివర్ణ పతాకంతో పాటు బ్రిటిష్‌ జెండా...

1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్య్ర దినోత్సవం. భారతీయుల ఆత్మగౌరవం, స్వాతంత్య్ర సమరంలో అద్భుతమైన విజయంతో గర్వించదగిన రోజు. అయితే, ఈ ప్రత్యేక రోజున భారతదేశ ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ కొన్ని చర్చనీయమైన నిర్ణయాలను తీసుకున్నారు. 1947 ఆగస్టు 10న బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్‌బాటన్‌కు నెహ్రూ రాసిన లేఖ ద్వారా ఈ విషయం బయటపడింది. ఆగస్టు 15న త్రివర్ణ పతాకంతో పాటు బ్రిటిష్ యూనియన్ జెండాను కూడా ఎగరవేయాలని లేఖలో నెహ్రూ ప్రస్తావించారు.

‘‘Selected Works of Nehru’’ పుస్తకంలో పొందుపరిచిన నెహ్రూ లేఖ ద్వారా ఈ విషయం వెల్లడైంది. అయితే, బ్రిటిష్ యూనియన్ జెండాను త్రివర్ణ పతాకంతో పాటు ఎగరవేయాలని ప్రతిపాదించిన నెహ్రూ.... ఇది ఒక పద్ధతిగా, బ్రిటిష్- భారతీయుల మధ్య పరస్పర గౌరవం, శాంతిని ప్రదర్శించడానికి ప్రయత్నించారు. స్వాతంత్య్ర పోరాటంలో భారత్ చేసిన త్యాగాలను బ్రిటిష్ ప్రభుత్వానికి గుర్తుచేయడానికి, శాంతి సందేశాన్ని ప్రసారం చేయడానికి నెహ్రూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నిర్ణయం కొందరు స్వాతంత్య్ర సమరయోధులు, దేశ భక్తుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. బ్రిటిష్ రాజ్యం నుంచి స్వేచ్ఛ పొందిన రోజున బ్రిటిష్ పతాకాన్ని ఎగరవేయడమనేది భారతీయుల గౌరవానికి విరుద్ధంగా భావించారు. స్వాతంత్య్ర పోరాటంలో చేసిన త్యాగాలను మరచిపోవడమేనని పలువురు నిరసన వ్యక్తం చేశారు.

Latest Videos

click me!