Karur Tragedy Vijay: తమిళనాడులో కరూరులో టీవీకే నాయకుడు, ప్రముఖ నటుడు విజయ్ దళపతి సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి మహిళలు, పిల్లలు సహా 30కి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమేంటి?
తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ఆధ్వర్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) భారీ ఎన్నికల ప్రచార సభ శనివారం (సెప్టెంబర్ 27, 2025) సాయంత్రం కరూరు జిల్లా వేలుచ్చామిపురంలో జరిగింది. దీనికి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. సుమారు సాయంత్రం 7.45 గంటల సమయంలో, విజయ్ వేదికపైకి రావడంతో, వేదికను దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో ప్రజలు ముందుకు తోసుకువెళ్లారు. దీంతో తోపులాటతో తొక్కిసలాట జరిగింది.
పలువురు ఊపిరాడక కుప్పకూలగా, చిన్నపిల్లలు తమ కుటుంబాల నుండి వేరైపోయారు. మహిళలు, పిల్లలు సహా అనేక మంది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.
26
TVK Vijay Rally : విజయ్ సభలో 30 మందికి పైగా మృతి
ఈ తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. చాలా మంది గాయపడ్డారు. మొదట అధికారులు 10 మంది మృతిని ధృవీకరించగా, రాత్రి 9 గంటల తర్వాత సమాచారం ప్రకారం 30 మందికి పైగా మృతి చెందినట్లు వెల్లడించారు. గాయపడిన మరో 30 మందికి పైగా కరూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తీవ్ర గాయాలున్నవారిని ఎరోడ్, తిరుచిరాపల్లి మెడికల్ కళాశాలలకు తరలించారు. జనం పెద్ద సంఖ్యలో రావడంతో అంబులెన్స్‌లు సభా ప్రాంగణంలోకి వెళ్లలేకపోయాయి. వాలంటీర్లు మానవ గొలుసులు ఏర్పాటు చేసి గాయపడిన వారిని బయటకు తీసుకువచ్చారు.
పెద్ద సంఖ్యలో జనం రావడంతో మొదలైన తోపులాట పరిస్థితులు కనిపించగానే విజయ్ తన ప్రసంగం ముగించారు. లైవ్ టెలివిజన్ ఫుటేజీలో విజయ్ తన ప్రసంగాన్ని ఆపి, కుప్పకూలిన వారికి నీళ్ల బాటిల్స్ పంపిణీ చేస్తూ కనిపించారు.
అంతేకాక, ఆయన స్వయంగా పోలీసుల సహాయం కోరారు. తల్లిదండ్రులనుండి విడిపోయిన చిన్నారి కోసం కూడా ఆయన వేదికపై నుంచి ఆచూకీ కోసం పిలుపునిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ సభ తొక్కిసలాట ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
విజయ్ సభకు సుమారు 30,000 మంది వస్తారని పోలీసులు అనుమతులు ఇచ్చారు. అయితే, స్థానిక అంచనాల ప్రకారం 60,000 మంది వరకు సభకు తరలి వచ్చారు. ప్రారంభంలో కరూరు కేంద్రంలో సభ జరగాల్సి ఉన్నా, ట్రాఫిక్ సమస్యల కారణంగా వేలుచ్చామిపురంకి వేదిక మార్చారు. అయితే, అక్కడి ప్రాంగణం కూడా భారీ జనసందోహాన్ని తట్టుకోలేకపోయింది. విజయ్ వేదికపైకి రాగానే అభిమానులు వెంటనే ముందుకు తోసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పింది. తొపులాట తొక్కిసలాటకు కారణమైంది.
56
Vijay Thalapathy: విజయ్ సభ విషాదం పై తమిళనాడు సర్కారు చర్యలు
జిల్లా అధికారులు ఈ విషాదం తొక్కిసలాట కారణంగా జరిగిందని తెలిపారు. మేజిస్ట్రేట్ స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, జిల్లా కలెక్టర్, ఆరోగ్య శాఖ, పోలీసు అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మృతుల కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున, గాయపడిన వారికి ₹50,000 చొప్పున సాయాన్ని పరిశీలిస్తున్నారు.
66
PM Modi : విజయ్ సభ విషాదం పై ప్రధాని మోడీ తీవ్ర విచారం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “కరూరులో జరిగిన దురదృష్టకర సంఘటన హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని Xలో పేర్కొన్నారు.