Kerala CM : ఎవరీ వి.డి. సతీశన్..? కె.సి. వేణుగోపాల్ కంటే తోపా..?

Published : May 14, 2026, 01:44 PM IST

కేరళ ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ ను ఎంపికచేసింది కాంగ్రెస్ అదిష్టానం. ఈ మేరకు ఏఐసిసి పరిశీలకురాలు దీపా దాస్ మున్షీ అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ తోపు లీడర్ కె.సి. వేణుగోపాల్ ని కాదని సతీశన్ ను ఎందుకు నియమించారంటే…

PREV
15
కేరళ సీఎంగా వి.డి. సతీశన్...

Kerala CM : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఊహకందని పలితాలు వచ్చాయి కాబట్టి కేరళ రిజల్ట్స్, ఆ తర్వాత చోటుచేసుకున్న రసవత్తర రాజకీయాల గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ అక్కడ కూడా గత పదిరోజులుగా పవర్ పాలిటిక్స్ సాగుతున్నాయి... సీఎం సీటుపై ఉత్కంఠ కొనసాగింది. ఎన్నికలు జరిగిన అన్నిరాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రమాణస్వీకారం చేసి ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన ఇక్కడ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియే కొనసాగుతోంది. అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ అదిష్టానం కేరళ సీఎంను నిర్ణయించింది... జాతీయస్థాయి నాయకుడు కేసీ వేణుగోపాల్ ను కాదని విడి సతీషన్ ను ముఖ్యమంత్రిగా నియమించింది.

25
ఎవరీ విడి సతీశన్..?

వడస్సేరి దామోదరన్ సతీశన్... ఇది వీడి సతీశన్ పూర్తి పేరు. ఈయన 1964 మే 31న నెట్టూర్ లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు విలాసిని అమ్మ, దామోదర మీనన్. విడి సతీశన్-లక్ష్మీప్రియ దంపతులకు ఉన్నిమాయ ఏకైక సంతానం.

నాయర్ల కుటుంబంలో పుట్టిపెరిగిన సతీశన్ ఉన్నత విద్యావంతుడు... సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు LLB, LLM పూర్తిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు సతీశన్ కేరళ హైకోర్టులో పదేళ్లపాటు లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేశారు.

35
విడి సతీశన్ రాజకీయ జీవితం...

వీడి సతీశన్ ఫ్యామిలీకి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు... కాబట్టి ఆయనే స్వయంగా తన పొలిటికల్ కెరీర్ ను నిర్మించుకున్నారు. న్యాయవాదిగా మంచి గుర్తింపు పొందినతర్వాత ప్రజాసేవపై ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చారు. 1996 లో మొదటిసారి పరవూరు అసెంబ్లీ నుండి పోటీచేసి ఓటమిపాలయ్యారు... అయితే 2001 లో మొదటిసారి విజయం సాధించి ఎమ్మెల్యేగా మారారు. అప్పటినుండి ఆయన వెనుదిరిగి చూడలేదు... ప్రతిసారి విజయం సాధించి కేరళ కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా మారారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది... దీంతో సతీశన్ ను ప్రతిపక్ష నాయకుడిగా అదిష్టానం నియమించింది. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతాలు చేసింది... పదేళ్లుగా అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ కూటమిని 2026 లో ఓడించింది. సతీశన్ ఆరోసారి పారావూర్ అసెంబ్లీ నుండి విజయం సాధించారు. సుదీర్ఘ చర్చల అనంతరం సతీశన్ ను కేరళ సీఎంగా నియమించింది కాంగ్రెస్ అదిష్టానం.

45
కేసి వేణుగోపాల్ కంటే సతీశన్ తోపా..?

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నాయకుల్లో కె.సి. వేణుగోపాల్ ఒకరు. కేరళకు చెందిన ఈయన ప్రస్తుతం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇంచార్జిగా పనిచేస్తున్నారు. ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అదిష్టానం దగ్గర ఈయనకు మంచి పలుకుబడి ఉంటుంది... అందకే ఈయనే కేరళ సీఎం అవుతారని అందరూ భావించారు.

అయితే కె.సి. వేణుగోపాల్ కంటే వి.డి. సతీశన్ కే కేరళ రాజకీయాల్లో పలుకుబడి ఎక్కువ. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు ఆయననే సీఎం అభ్యర్థిగా భావించారు... అందుకే కాంగ్రెస్ కూటమిని గెలిపించారు. ఇలా లోకల్ గా బలమున్న నాయకుడు కాబట్టే తమకు చాలా దగ్గరివాడైన వేణుగోపాల్ ను కాదని సతీశన్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు కాంగ్రెస్ పెద్దలు.

55
కేరళలో కాంగ్రెస్ హవా...

కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డోమొక్రటిక్ ఫ్రంట్ (UDF) విజయం సాధించింది... 10 ఏళ్ల లెప్ట్ డొమోక్రటిక్ ఫ్రంట్ (LDF) పాలనకు తెరపడింది. యూడిఎఫ్ 102 స్థానాలతో క్లియర్ మెజారిటీ సాధించింది... ఇందులో కాంగ్రెస్ పార్టీవే 63 సీట్లు. ఇక ఎల్డిఎఫ్ కేవలం 35 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇలా అత్యధిక స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన కాంగ్రెస్ కే ముఖ్యమంత్రి పదవి దక్కింది... వి.డి. సతీశన్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories