IMD Rain Alert : అరేబియా సముద్రంలో ఓ అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి… వర్షాలు మొదలవుతున్నాయి.
IMD Rain Alert : భారతదేశంలో కాలంతో పనిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు కూడా పలు రాష్ట్రాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతుండటంతో దక్షిణాది రాష్ట్రాలకు వర్షాలు తప్పడంలేదు. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది... దీని ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి.
25
అరేబియా సముద్రంలో అల్పపీడనం
అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని... ఇది కేరళ తీరంవైపు కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ప్రధానంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై ఉంటుందని... కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. తీరప్రాంతాల్లో గాలుల వేగం పెరుగుతుంది... సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది కాబట్టి మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
35
ఏపీపై అల్పపీడన ప్రభావం...
అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండదని వాతవరణ శాఖ చెబుతోంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని తీరప్రాంతాలు, తమిళనాడు బార్డర్ జిల్లాల్లో వాతావరణం మారిపోతుందట. అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని... కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘాలతో కప్పేసి ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతోంది.. ఉదయం, రాత్రి వేళల్లో చలి ఉంటోంది. అలాగే పొగమంచు కూడా కురుస్తోంది. పగటిపూట మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. మన్యం, కొండప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పట్లో భారీ వర్షాలకు అనుకూల పరిస్థితులేమీ కనిపించడంలేదని వాతావరణ శాఖ చెబుతోంది.
55
తెలంగాణ వెదర్
తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది... రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవగా ప్రస్తుతం సాధారణ శీతాకాల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి... అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి.
నిన్న(జనవరి 27, మంగళవారం) అత్యల్పంగా ఆదిలాబాద్ లో 15.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక మెదక్ లో 16.4, రామగుండంలో 17.2, హన్మకొండలో 17.5, నల్గొండలొ 18.4, నిజామాబాద్ లో 19.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 19 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది.