వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా షాపూర్ తాలూకాలో గర్గావ్ గ్రామంలో మాట్లాడుతోన్న కాకి అందరి దృష్టిని ఆకర్షించింది. స్థానికంగా నివాసం ఉంటున్న తనుజా ముఖ్నే అని మహిళ ఈ కాకిని పెంచుకుంటోంది. మూడు సంవత్సరాల క్రితం తన తోటలో గాయపడిన ఈ కాకిని చూసిన ఆమె పదిహేను రోజులపాటు సంరక్షించారు.
అయితే ఆ కాకి పూర్తిగా కోలుకున్న తర్వాత తమ వద్దే ఉంచుకొని దానిని పెంచుకోవడం ప్రారంభించారు. కాకిని పెంచుకోవడమే విచిత్రం అంటే అది ఆ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిపోవడం మరో విచిత్రం. ఎంతలా అంటే ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుకునే మాటలను ప్రతీ రోజూ విని ఆ మాటలను స్పష్టంగా అనుకరించేలా. "కాకా," "బాబా," "మమ్మీ" లాంటి మరిన్ని పదాలను కూడా పలుకుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.