అరెస్ట్ చేయాలంటూ..
వీడియోలో స్పష్టంగా సాక్ష్యం ఉన్నప్పటికీ, మహిళ పోలీస్ ఫిర్యాదు చేసిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఆ వ్యక్తిని గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. “ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇలాంటి ఘటనలు ఆగవు” అని వ్యాఖ్యానించారు. ఇక మరికొందరు మాత్రం ఇలాంటి వారిని నడి రోడ్డుపై చెప్పుతో కొట్టాలని కామెంట్స్ చేస్తున్నారు.
సమాజానికి సందేశం
ఈ సంఘటన కేవలం ఒక బస్సులో జరిగిన లైంగిక వేధింపుల కేసు మాత్రమే కాదు, సమాజం మౌనం ఎలా నేరస్తులకు బలం ఇస్తుందో కూడా చెబుతోంది. బాధితురాలు సాక్ష్యాన్ని సేకరించి తన ధైర్యాన్ని చూపించినా, ఆ బస్సులో ఉన్న వారంతా నిశ్శబ్దంగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఇటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ స్పందించడం, న్యాయం సాధించే దిశగా సహాయం చేయడం సమాజపు బాధ్యతగా మారాలి.