Rahul Gandhi: బీజేపీ ఓట్లను దొంగతనం చేస్తోంది అనేది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణ. ప్రెస్‌మీట్‌లను ఏర్పాటు చేసి మరీ బీజేపీపై అటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ప్రస్తావించిన ఓ అమ్మాయి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నకిలీ ఓట్లు వేశారని ఆరోపించారు. ఒకే వ్యక్తి ఫోటోను ఉపయోగించి 10 బూత్‌లలో 22 ఓట్లు వేశారని, అదే ఫోటోను వేర్వేరు పేర్లతో ఓటర్ జాబితాల్లో చేర్చారని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. సీమా, రష్మి, స్వీటీ, సరస్వతి వంటి పేర్లతో ఆ ఫోటో కనిపించిందని తెలిపారు. ఈ వ్యవహారం ఎన్నికల వ్యవస్థలో భారీ లోపాలను బయటపెడుతోందని ఆయన అన్నారు.
25
వైరల్ అయిన ‘బ్రెజిల్ మోడల్’ ఫోటో
రాహుల్ గాంధీ ప్రెస్ మీట్‌లో చూపించిన ఆ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. బ్లూ జాకెట్ వేసుకున్న ఆ మహిళ అసలు ఎవరు అని నెటిజన్లు పెద్ద ఎత్తున వెతకడం మొదలు పెట్టారు. తరువాత తెలిసింది ఏమిటంటే.. ఆ ఫోటో బ్రెజిల్‌కు చెందిన మోడల్ లారిసా నెరీ. ఈమె ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. 2017లో స్టాక్ ఇమేజ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఆ ఫోటోను లక్షలాది మంది డౌన్‌లోడ్ చేశారు. అదే ఫోటో భారత ఓటర్ల జాబితాలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
35
స్పందించిన లారిసా
ఈ విషయం కాస్తా లారిసా వరకు చేరింది. దీంతో ఆమె ఎట్టకేలకు ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. తన పాత ఫోటోను భారత ఎన్నికల మోసంలో వాడారని లారిసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. “అది నేను 18-20 ఏళ్ల వయసులో తీసుకున్న ఫోటో. స్టాక్ ఇమేజ్ సైట్‌లో అది ఉన్నది. దాన్ని ఎవరో కొనుగోలు చేసి, భారత ఓటర్ల జాబితాలో వాడారు. ఇది పూర్తిగా మోసం. నాకు భారత రాజకీయాలతో ఏ సంబంధం లేదు,” అని లారిసా స్పష్టం చేసింది. మీడియా నుంచి ఫోన్‌లు, ఇంటర్వ్యూ రిక్వెస్ట్‌లు వరుసగా వస్తున్నాయని ఆమె వాపోయింది.
రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. హర్యానా ఎన్నికల్లో ఐదు లక్షలకుపైగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, అయినా ఈసీ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. “ఒక విదేశీ మోడల్ ఫోటోతోనే ఓట్లు వేయించారంటే ఇది ప్రజాస్వామ్యంపై దాడి. బీజేపీ, ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయి” అని ఆరోపించారు. ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
55
అంతర్జాతీయంగా కూడా చర్చ
ఈ ఘటన భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బ్రెజిల్ మీడియా కూడా లారిసా వివాదాన్ని ప్రధానంగా ప్రసారం చేసింది. ఆమె “ఇది నా కెరీర్‌పై ప్రభావం చూపుతోంది. నా లాయర్ ద్వారా భారత రాయబారి కార్యాలయానికి ఫిర్యాదు చేశాను” అని వీడియోలో చెప్పింది. మరోవైపు, బీజేపీ ఈ ఆరోపణలను రాజకీయ నాటకమని కొట్టిపారేసింది. అయితే ఎన్నికల సంఘం ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించింది.