స్థానికులు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొద్దిసేపట్లోనే వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యి చర్చనీయాంశమైంది. ఈ ఘటన దావణగెరె బడావానే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగినా, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే, పబ్లిక్ ప్రదేశంలో ఇలాంటి సంఘటన జరగడం చట్టం, క్రమశిక్షణపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.