Viral News: రాత్రి ఫ్లాట్‌లో ఇద్దరు అమ్మాయిలతో ఉన్న యువకుడు.. సొసైటీ చేసిన పనికి రచ్చ, రచ్చ

Published : Dec 04, 2025, 02:52 PM IST

Viral News: అద్దె ఇంట్లో ఎన్నో నిబంధ‌న‌లు ఉంటాయ‌ని తెలిసిందే. అన్ని య‌జ‌మానికి న‌చ్చిన‌ట్లే ఉండాలి. లేదంటే అత‌ని ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దు. తాజాగా బెంగళూరులో జ‌రిగిన ఓ అంశం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. 

PREV
14
రాత్రి అతిథులు ఉన్నారని జరిమానా

బెంగళూరులో ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే యువకుడు తన ఫ్లాట్‌లో ఇద్దరు అమ్మాయిలు ఒక రాత్రి ఉన్నారని సొసైటీ రూ.5,000 జరిమానా విధించిన ఘటన సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. సంబంధిత వ్యక్తి రెడిట్‌ ద్వారా ఇన్‌వాయిస్‌ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు.

24
బ్యాచిలర్లకు వేరుగా నియమాలు?

ఆ యువకుడి ప్రకారం, తాము ఉన్న కమ్యూనిటీలో బ్యాచిలర్లు రాత్రి స్నేహితులు లేదా బంధువులు ఫ్లాట్‌లో స్టే చేయ‌డం నిషేధం. కానీ కుటుంబాలకు ఈ నిషేధం లేదు. “మేము ఫీజులు అన్నీ చెల్లిస్తున్నాం. మాకు ఒక నిబంధన, కుటుంబాలకు మరో నిబంధన ఎందుకు?” అని అతను ప్ర‌శ్నిస్తున్నాడు.

34
మొద‌టి సారే అయినా..

ఇది మొదటి ఉల్లంఘన అయినా ముందుగా ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. “ఇది చిన్న విషయం అయినా ఇలా అవమానంగా ప్రవర్తించడం సరైంది కాదు. సొసైటీ నియమాలను మళ్లీ పరిశీలించేలా చేయవచ్చా?” అని పోస్ట్ చేశాడు. యువ‌కుడు చేసిన పోస్ట్‌పై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ మొదలైంది. ఈ పోస్టు చూసిన కొంద‌రు దీనిపై క‌చ్చితంగా లీగ‌ల్ చ‌ర్య తీసుకోవాల‌ని అంటుండ‌గా.. మరికొందరు ఇది పట్టించుకోదగ్గ విషయం కాదని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఆ అపార్ట్‌మెంట్ మార‌డం మంచిద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. అయితే మ‌రికొంద‌రు మాత్రం బ్యాచిల‌ర్ రూమ్స్‌లో ఇలాంటి నిబంధ‌న‌లు ఉంటేనే మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

44
బ్యాచిలర్లపై వివక్ష

చాలామంది ఈ జరిమానాకి అర్థం లేదని అన్నారు. “ఇలా చేస్తే అపార్ట్‌మెంట్‌ను ఓయో హోటల్‌లా చూస్తున్నట్టే” అని కామెంట్‌ చేశారు. లీగల్‌గా పోరాడవచ్చు కానీ ఆ తర్వాత ఇంటి ఓన‌ర్స్ ఇక‌పై వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి వెనుకాడతారని కామెంట్స్ చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా బ్యాచిలర్లు ఎదుర్కొనే కామ‌న్‌ సమస్య అని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాచిలర్లపై వివక్షకు ఇది నిదర్శనమనే చర్చ మొదలైంది. 

గమనిక: ఇది సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఆధారంగా అందించిన కథనం. ఏషియా నెట్ న్యూస్ దీనిని అధికారికంగా ధృవీక‌రించ‌డం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories