No Helmet No Fuel: రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి 30 వరకు ఉత్తరప్రదేశ్‌లో ‘నో హెల్మెట్ నో ఫ్యూయల్' అనే ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రమాదాల వల్ల దేశవ్యాప్తంగా లక్షాలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను నివారించాలంటే.. రోడ్డుపై వెళ్లేటప్పుడు కనీస భద్రత నియామాలు పాటించాలి. ప్రధానంగా బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపడం చాలా సేఫ్టీ. కానీ, చాలామంది ప్రజలు హెల్మెట్ పెట్టుకోవడం లైట్ తీసుకొని జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. అలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టాలని ఓ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటీ? ఆ నిర్ణయమేంటీ ?
25
నో హెల్మెట్ నో ఫ్యూయల్
రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో హెల్మెట్‌కి, పెట్రోల్‌కి లింక్ పెట్టేశారు. పెట్రోల్ లేకపోతే బండి నడవదు కాబట్టి హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయొద్దు అనే రూల్ పెట్టేసింది. ఈ ఆలోచన కొత్తగా ఉన్నా చాలా లాజిక్‌గా కూడా ఉంది. దీంతో ఈ విషయం క్షణాల్లో వైరల్ మారింది. నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏ ఈ నిర్ణయం ఎక్కడ అని ఆలోచిస్తున్నారా?
35
యూపీ సర్కార్ కీలక నిర్ణయం
రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి సర్కార్ ఈ విన్నూత నిర్ణయం తీసుకుంది. హెల్మెట్ పెట్టుకోని వారికి పెట్రోల్ పోయవద్దని పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చేసింది. దీంతో హెల్మెట్ లేకుండా వచ్చి పెట్రోల్ అడిగిన వాహనదారులకు ఇకపై నో చెప్పాలని పెట్రోల్ బంకులకు ఆర్డర్స్ జారీ చేసింది. ఈ రూల్స్ ను సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి తీసుకరాబోతుంది.
ఈ తరుణంలో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు 'హెల్మెట్ లేదు, ఇంధనం లేదు' అనే ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించబోతోంది. జిల్లా మేజిస్ట్రేట్ నాయకత్వంలో, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ (DRSC) సమన్వయంతో ఈ ప్రచారం నిర్వహించబడుతుంది. ఈ ప్రచారంలో పోలీసులు, రెవెన్యూ/జిల్లా పరిపాలన, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 129 ప్రకారం ద్విచక్ర వాహనదారుడు, పిలియన్ రైడర్ ఇద్దరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అదే సమయంలో సెక్షన్ 194D కింద ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి జరిమానా విధించవచ్చు. అలాగే..
సుప్రీంకోర్టు సూచనలను అనుసరిస్తూ యోగి ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ‘హెల్మెట్ లేకపోతే.. ఇంధనం లేదు’ ప్రచారాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా IOCL, BPCL, HPCL వంటి అన్ని పెట్రోల్ పంప్ ఆపరేటర్లను హెల్మెట్ ధరిస్తున్న వ్యక్తులకు మాత్రమే ప్యూయల్ పోయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రూల్ వల్ల ఇంధన అమ్మకాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని రవాణా కమిషనర్ స్పష్టం చేశారు.
55
శిక్ష కాదు.. హెల్మెట్ సాంప్రదాయం: సిఎం యోగి
ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా ప్రారంభించిన ‘నో హెల్మెట్ లేదు- నో ఫ్యుయల్’ అనే ప్రచారంపై సిఎం యోగి స్పష్టత ఇచ్చారు. ఈ రూల్ ముఖ్య ఉద్దేశ్యం పౌరులను శిక్షించడం కాదని, కానీ ప్రతి ద్విచక్ర వాహనదారుడు ‘ముందు హెల్మెట్, తర్వాత ఇంధనం’ అనే నియమాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు.
హెల్మెట్ ధరించడం భద్రతా బీమా లాంటిదని అన్నారు. గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం కారణంగా తీవ్రమైన గాయాలు, మరణాలు సంభవించాయని గుర్తు చేశారు. అంతేకాక, ఈ ప్రచారం ప్రజలకు చట్టపరమైన భయాన్ని సృష్టించకుండా, సురక్షిత, భద్రతను ప్రేరేపించేలనే ఉద్దేశంతో తీసుకవచ్చినట్టు యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది.