ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు, ఇకపై శని ఆదివారాలన్నీ సెలవులు?

Published : Aug 28, 2025, 10:37 AM IST

ప్రభుత్వ ఉద్యోగులకు శని, ఆదివారం రెండు రోజులు పూర్తిగా సెలవు ఇచ్చేలా కేరళ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యోగుల పని వేళలు, సెలవు దినాల్లో మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. కేరళలో ఇది అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో కూడా రావచ్చు.

PREV
14
ప్రతి వారం అయిదు రోజుల ఆఫీస్

ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రకటిస్తుంది.  ఆ పథకాలు ప్రజలకు చేరాలంటే ప్రభుత్వ ఉద్యోగులు చాలా ముఖ్యం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు అనేక రాయితీలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ పెంపు, జీతాలు, ఇతర ప్రయోజనాలు, పింఛను వంటివి అందిస్తున్నారు.

 గృహ రుణాలు, వైద్య సహాయం, పింఛను వంటివి కూడా అందిస్తున్నారు. ప్రభుత్వ సెలవు దినాలలో సెలవులు కూడా లభిస్తాయి. ఇప్పుడు ప్రతి వారం శని, ఆదివారాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల  సెలవు ఇవ్వాలని కూడా కేరళ ప్రభుత్వం భావిస్తోంది. 

24
వచ్చే నెల తేలిపోతుంది

వారంలో 5 రోజులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేలా కేరళలో కొత్త విధానాన్ని అమలు చేయాలని ఆలోచన జరగుతోంది. 2014లో కూడా ఈ సెలవులపై చర్చలు జరిగాయి. కానీ అది అమల్లోకి రాలేదు. రెండు రోజులపాటూ సెలవులు ఇవ్వడం వల్లవిద్యుత్, వాహనాల వినియోగం తగ్గుతుందని భావిస్తున్నారు.

 కానీ ప్రజలకు అందించే సేవలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఆ ఆలోచనను ఆపేశారు. ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ప్రణాళికను అమలు చేయడానికి ప్రస్తుతం మళ్లీ ఆలోచిస్తున్నారు.  ఈ విషయంపై సెప్టెంబర్ 11న ముఖ్యమైన సమావేశం జరగనుంది.

34
సెలువులు తగ్గించి...

ఈ సమావేశంలో శని, ఆదివారాల్లో రెండు రోజుల సెలవు ఇవ్వడంపై అభిప్రాయాలు సేకరిస్తారు. రెండు రోజుల సెలవు వల్ల కలిగే లాభనష్టాలను చర్చిస్తారు. చాలా సంస్థలు ఈ సెలవులకు మద్దతు తెలిపాయి.

 రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నందున ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెబుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కేరళలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న 20 సెలవులను 15కి తగ్గించాలని కూడా ప్రణాళిక చేస్తున్నారు.

44
మన రాష్ట్రాల్లో....

మధ్యాహ్న భోజన విరామాన్ని 45 నిమిషాల నుండి 30 నిమిషాలకు తగ్గించడం, ఉదయం ఆఫీసు సమయాన్ని ముందుగా ప్రారంభించడం వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. సాయంత్రం 15 నిమిషాలు అదనంగా పనిచేసేలా ఈ సెలవుల ప్రణాళికను అమలు చేయాలని కేరళ ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. 

కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు శని, ఆదివారాల్లో సెలవు ఇవ్వడంపై తుది నిర్ణయం వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉంది. కేరళలో ఇది అమల్లోకి వస్తే పక్క రాష్ట్రాల్లోని ఉద్యోగులు కూడా అవకాశం ఉంది. కేరళలో సక్సెస్ అయితే … దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ డిమాండ్ పెరగవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories