Union Budget: ఈ ఎర్ర బ్యాగ్‌కి, బ‌డ్జెట్‌కి సంబంధం ఏంటీ.? అస‌లు క‌థేంటో తెలుసా.?

Published : Jan 28, 2026, 12:21 PM IST

Union Budget: ప్ర‌తీ ఏటా జ‌రిగే బ‌డ్జెట్ స‌మావేశాల‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి ఉంటుంది. ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాలు త‌మ‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతాయ‌ని పారిశ్రామిక‌వేత్త‌లు మొద‌లు సామాన్య ప్ర‌జ‌ల వ‌ర‌కు ఎదురుచూస్తుంటారు.  

PREV
15
బడ్జెట్ అంటేనే ఎర్ర బ్యాగ్ ఎందుకు గుర్తొస్తుంది.?

ప్రతి సంవత్సరం బడ్జెట్ రోజు పార్లమెంట్ మెట్లు ఎక్కుతూ, ఆర్థిక మంత్రి చేతిలో ఎర్ర రంగు బ్యాగ్ పట్టుకుని వెళ్తుంటారు. సంవత్సరాలుగా బడ్జెట్‌కు అదే గుర్తుగా మారిపోయింది. అసలు ఈ ఎర్ర బ్యాగ్‌కు బడ్జెట్‌కు మధ్య సంబంధం ఎక్కడ మొదలైంది? ఇది కేవలం సంప్రదాయమేనా లేక దీని వెనుక చరిత్ర ఉందా? ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాం.

25
బడ్జెట్‌కు రెడ్ క‌ల‌ర్‌కు బంధం ఎలా మొద‌లైంది.?

భారతదేశంలో బడ్జెట్ ఎర్ర రంగులో ఉండటం వెనుక ప్రధానంగా బ్రిటిష్ పాలన ప్రభావం ఉంది. బ్రిటన్‌లో ప్రభుత్వ, చట్టపరమైన, ఆర్థిక పత్రాలను ఎప్పటినుంచో ఎర్ర రంగు కవర్లలో భద్రపరుస్తూ వచ్చారు. ఎర్ర రంగు అంటే అక్కడ అధికారం, బాధ్యత, కీలక నిర్ణయాలకు గుర్తుగా భావించేవారు. అదే విధానాన్ని భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం కూడా అమలు చేసింది. అందుకే బడ్జెట్ లాంటి అత్యంత కీలక పత్రాలకు ఎర్ర రంగు కవర్ వాడటం మొదలైంది.

35
ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి కొనసాగుతోంది?

భారతదేశంలో తొలి బడ్జెట్‌ను 1860లో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో దేశం పూర్తిగా బ్రిటిష్ పాలనలోనే ఉండేది. పరిపాలనకు సంబంధించిన అన్ని నియమాలు బ్రిటన్ నుంచే వచ్చేవి. అప్పటి నుంచే బడ్జెట్ పత్రాలను ఎర్ర కవర్ లేదా ఎర్ర బ్రీఫ్కేస్‌లో ఉంచే సంప్రదాయం మొదలైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దశాబ్దాల పాటు అదే పద్ధతి కొనసాగింది. క్రమంగా ఎర్ర బ్రీఫ్కేస్ బడ్జెట్‌కు శాశ్వత గుర్తుగా మారిపోయింది.

45
బడ్జెట్‌లో ఎర్ర రంగం సూచించే అర్థం ఏంటి?

ఎర్ర రంగును బడ్జెట్‌లో కేవలం అందం కోసం ఎంచుకోలేదు. ఇది బాధ్యత, శక్తి, గంభీరతకు సంకేతంగా భావిస్తారు. బడ్జెట్ అంటే దేశ ఆదాయం, ఖర్చులు, పన్నులు, సంక్షేమ పథకాలు, ఆర్థిక దిశను నిర్ణయించే ముఖ్యమైన పత్రం. అందుకే ఈ ఫైల్‌లో ఉన్న నిర్ణయాలు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని సూచించేందుకు ఎర్ర రంగును ఉపయోగించారు.

55
2019లో మారిన సంప్రదాయం.

2019లో తొలిసారి ఈ సంప్రదాయంలో మార్పు జరిగింది. ఆర్థిక మంత్రి ఎర్ర బ్రీఫ్కేస్ బదులు సాధారణ రెడ్ క‌ల‌ర్‌ ఫోల్డర్‌ను ఉపయోగించారు. ఇది వలస పాలన కాలపు గుర్తుల నుంచి బయటపడుతున్నామనే సంకేతంగా ప్రభుత్వం భావించింది. అయితే బ్రీఫ్కేస్ మారినా, ఎర్ర రంగంతో బడ్జెట్‌కు ఉన్న చారిత్రక అనుబంధం మాత్రం ఇప్పటికీ ప్రజల గుర్తుల్లో నిలిచే ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories