మానాడులో విజయ్ తన పార్టీ టీవీకే లక్ష్యాలను కూడా వివరించారు. "మహిళలు, యువకులు, రైతులు, కూలీలు, మత్స్యకారులు, వృద్ధులు.. ఇలా అందరి సంక్షేమమే మా లక్ష్యం" అన్నారు. అధికారం కోసం కాదు.. తాను ప్రజల కోసమే రాజకీయంలోకి వచ్చానని చెప్పారు.
ప్రజా సమస్యల పరిష్కారమే తమ దిశ అని వివరించారు. "నిజాయితీ ఉన్న నాయకుడు కావడం ముఖ్యం. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను" అని విజయ్ చెప్పారు.
విజయ్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో వేడి పెరిగింది. బీజేపీ, డీఎంకే రెండింటినీ లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను కదిలించాయి.
మధురై ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేయడం, అలాగే అన్ని నియోజకవర్గాల్లో టీవీకే పోటీ చేస్తుందని ప్రకటించడం రాష్ట్ర ఎన్నికల్లో కొత్త సమీకరణలకు దారితీస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో విజయ్ ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి.