
భారతదేశంలో పనిచేస్తున్న దాదాపు ప్రతి ఉద్యోగికి PF (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఉంటుంది. ఈ ఖాతాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తోంది. తాజాగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది.
సెంట్రల్ బోర్డ్ ఉద్యోగులకు డెత్ రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చే ఎక్స్‌గ్రేషియో మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. అలాగే.. పీఎఫ్ కీలక మార్పులు చేసింది. ఇంతకీ ఆ మార్పులేంటీ? డెత్ ఎక్స్‌గ్రేషియో ఎంత నుంచి ఎంతకు పెరిగింది? అనే విషయాలు తెలుసుకుందాం.
సెంట్రల్ బోర్డ్ ఉద్యోగులకు మరణ సహాయ నిధి కింద డెత్ ఎక్స్-గ్రేషియా EPFO చెల్లిస్తుంది. గతంలో ఇది రూ.8.8 లక్షలుగా ఉండేది. ఈ మొత్తాన్ని రూ.8.8 లక్షల నుండి రూ.15 లక్షలకు పెంచింది. ఈ కొత్త విధానం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. అంటే ఈ తేదీ తర్వాత, ఉద్యోగంలో ఉన్న వ్యక్తి మరణిస్తే, అతని కుటుంబానికి పాత రూ.8.8 లక్షలకు బదులుగా రూ.15 లక్షలు లభిస్తాయి.
ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదించింది. ఇది EPFO అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, యజమానులు, ఉద్యోగులు ఉంటారు.
ఈ ఎక్స్-గ్రేషియా మొత్తం ఒక్కసారి మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం పెరుగుతుందని EPFO స్పష్టం చేసింది. ఏప్రిల్ 1, 2026 నుండి ప్రతి సంవత్సరం 5% చొప్పున పెంచబడుతుంది.
దీని అర్థం ఉద్యోగుల కుటుంబాలకు రాబోయే సంవత్సరాల్లో మరింత ఆర్థిక భద్రత లభిస్తుంది. ఆగస్టు 19న EPFO జారీ చేసిన సర్క్యులర్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు (నామినీ లేదా చట్టపరమైన వారసుడు) సిబ్బంది సంక్షేమ నిధి నుండి ఇవ్వబడుతుంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తరచుగా కొత్త మార్పులు చేస్తూ వస్తోంది. తాజాగా, గత వారం కూడా చందాదారులకు ప్రయోజనం కలిగించే కీలక మార్పులు చేసింది. ప్రధానంగా డెత్ క్లెయిమ్ (Death Claim)ప్రాసెస్ విషయంలో కీలక మార్పులు చేసింది.
ఇప్పటి వరకు ఒక PF ఖాతాదారు మరణిస్తే ఆయన డబ్బు మైనర్ పిల్లలకు చెందాల్సి వస్తే, గార్డియన్షిప్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ వల్ల కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ, కొత్త నిబంధనల ప్రకారం ఇకపై గార్డియన్షిప్ సర్టిఫికెట్ అవసరం లేదు. కేవలం మైనర్ పిల్లల పేరిట బ్యాంక్ ఖాతా తెరవడం సరిపోతుంది. ఆ ఖాతాలోనే PF డబ్బు నేరుగా జమ అవుతుంది.
EPFO మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు PF ఖాతాదారులు తమ ఆధార్ నంబర్‌ను UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్)తో లింక్ చేయడం లేదా వెరిఫై చేయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా, చిన్న తప్పిదాల కారణంగా జాయింట్ డిక్లరేషన్ సమర్పించాల్సి వచ్చేది.
ఆ ప్రక్రియలో కంపెనీ యజమాని జోక్యం తప్పనిసరి అవడంతో సభ్యులు ఇబ్బందులు పడ్డారు. ఇకపై, EPFO ఆధార్ అనుసంధాన ప్రక్రియను సులభతరం చేసింది. సభ్యులు ఇప్పుడు ఎటువంటి జాప్యం లేకుండా తమ ఆధార్ వివరాలను సరిదిద్దుకోవచ్చు. UAN తో లింక్ చేసుకోవచ్చు. పైన చెప్పింది సెంట్రల్ బోర్డు ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.
EPFO సభ్యులకు మరో శుభవార్త. ఇతర రంగాల ఉద్యోగులకు కూడా కనీస బీమా వర్తిస్తుంది. ఇక్కడ ఈపీఎఫ్ సభ్యులు సర్వీసు సమయంలో చనిపోతే వారి కుటుంబానికి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్ కింద ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పథకం ప్రకారం, కనీస బీమా ₹2.5 లక్షలు, గరిష్టంగా ₹7 లక్షలు వరకూ లభించనుంది.
ఇకపై, ఉద్యోగి ఒక సంవత్సరం కంటే తక్కువ సర్వీస్ చేసినా కూడా కనీస బీమా ₹50,000 వరకూ అందజేస్తారు. ఈ బీమా కోసం కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగి వేతనం నుంచి 0.5% చందా చెల్లించాలి. అంటే, ప్రైవేట్ లేదా ఇతర రంగాల్లో పనిచేసే EPFO సభ్యులందరికీ కనీస బీమా రక్షణ హామీగా ఉంటుంది.
EPFO డేటా ప్రకారం జూన్‌లో 21.8 లక్షల నెట్ ఫార్మల్ జాబ్స్ సృష్టించబడ్డాయి. ఇది 2018 తర్వాత అత్యధికం. కొత్తగా చేరిన 10.6 లక్షలలో 60% యువత (18–25 ఏళ్లు). మహిళల సంఖ్య 4.7 లక్షలు (10% వృద్ధి). మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హరియాణా కలిపి 61% వృద్ధి సాధించాయి. ప్రధానంగా పాఠశాలలు, నిపుణుల సేవలు, నిర్మాణం, విశ్వవిద్యాలయాలు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.