
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, గత కొన్ని రోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. "కొత్త చట్టాల ప్రకారం భార్య వద్దని చెప్పినా భర్త మందు తాగితే అది నేరమే.. కచ్చితంగా జైలు శిక్ష పడుతుంది" అని ఆ మెసేజ్ సారాంశం. అంతేకాదు, మందు తాగి గృహహింసకు పాల్పడితే భారతీయ న్యాయ సంహిత (BNS) లో ఒక కొత్త స్పెషల్ చట్టాన్ని కూడా తెచ్చారని ఆ వార్తల్లో చెబుతున్నారు.
దీంతో మందుబాబుల్లో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. నిజంగానే భార్య వద్దంటే మందు తాగకూడదా? ఒకవేళ తాగితే పోలీసులొచ్చి అరెస్ట్ చేస్తారా? అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ వార్తల్లో అసలు వాస్తవం ఎంత? కొత్తగా వచ్చిన BNS చట్టం మందు, గృహహింస గురించి ఏం చెబుతోంది? లాంటి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక విషయం మీద క్లారిటీ తెచ్చుకోవాలి. అదేంటంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త వంద శాతం నిజం కాదు. కానీ, చట్టపరమైన కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. భార్య వద్దని చెప్పినా భర్త మందు తాగితే అది నేరం అని, దానికి డైరెక్ట్‌గా జైలు శిక్ష పడుతుందని కొత్త భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలో ఎక్కడా స్పెసిఫిక్‌గా చెప్పలేదు.
ఎవరైనా సరే ఇంట్లో కూర్చుని కేవలం మందు తాగడం అనేది మన దేశంలో నేరం కిందకు రాదు. అలాగే కేవలం "మందు సేవించి చేసే గృహహింస" కోసం BNS లో స్పెషల్ గా ఎలాంటి కొత్త సెక్షన్‌ను తీసుకురాలేదు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మందు తాగడం నేరం కాకపోయినా, తాగాక చేసే పనులకు మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
మందు తాగడం పర్సనల్ ఛాయిస్ అయినప్పటికీ.. ఆ తర్వాత జరిగే పరిణామాల విషయంలో, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో కొత్త చట్టం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మందు మత్తులో ఉన్నా లేదా నార్మల్ గా ఉన్నా.. భార్యపై శారీరక, మానసిక లేదా ఆర్థిక వేధింపులకు పాల్పడితే దాన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
గతంలో ఉన్న పాత క్రిమినల్ చట్టం IPC 498A ప్లేస్ లో ఇప్పుడు BNS సెక్షన్ 85 అమలులోకి వచ్చింది. భర్త లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించినా, దాడులు చేసినా ఈ సెక్షన్ కింద ఏకంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఫైన్ పడుతుంది. ఇది 'కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్' నేరం. సింపుల్ గా చెప్పాలంటే.. కంప్లైంట్ అందిన వెంటనే పోలీసులకు ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే పవర్స్ ఉంటాయి. స్టేషన్ లో బెయిల్ దొరకడం కూడా కష్టం.
కొంతమంది మందుబాబులు ఫుల్లుగా తాగి, ఇంట్లో భార్యపై ఇష్టమొచ్చినట్లు దాడులు చేస్తుంటారు. తీరా పోలీసులొచ్చాక లేదా కోర్టుకు వెళ్లాక.. "సార్ నేను ఫుల్ మత్తులో ఉన్నాను, నా మీద నాకు కంట్రోల్ లేదు, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు" అని నాటకాలు ఆడేవారు. పాత చట్టాల్లో అన్ సౌండ్ మైండ్ కింద పరిగణించడంతో శిక్ష తగ్గే ఛాన్స్ ఉండేది.
కానీ కొత్త BNS చట్టం సెక్షన్ 24 ప్రకారం ఈ డ్రామాలు ఇక వర్కౌట్ అవ్వవు. ఎవరైనా కావాలని మందు తాగి భార్యపై లేదా ఇతరులపై అటాక్ చేస్తే.. వారికి చట్టం నుంచి ఎలాంటి ఎక్స్‌క్యూజ్ దొరకదు. స్వచ్ఛందంగా మందు తాగడం అనేది మానసిక అనారోగ్యం కిందకు రాదు అని చట్టం తేల్చి చెప్పేసింది. కాబట్టి, నార్మల్ కండిషన్ లో ఒక క్రైమ్ చేస్తే ఎలాంటి కఠిన శిక్ష పడుతుందో, తాగి చేసినా కూడా ఎగ్జాక్ట్ గా అదే రేంజ్ లో శిక్ష పడుతుంది.
కేవలం గృహహింస సెక్షన్ 85 మాత్రమే కాదు, మందు తాగి గొడవలకు దిగితే మరికొన్ని సెక్షన్లు కూడా అదనంగా తోడవుతాయి. మందు సేవించి ఫిజికల్ గా అటాక్ చేసినా, తిట్టినా లేదా బెదిరించినా కింది సెక్షన్లు వర్తిస్తాయి..
కొత్తగా వచ్చిన BNS తో పాటు, మహిళలకు అండగా 'గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం - 2005' (PWDVA) కూడా దేశంలో చాలా పటిష్ఠంగా అమలులో ఉంది. ఈ చట్టం ద్వారా బాధితులకు తక్షణ రక్షణ, నివాస హక్కు, అలాగే ఆర్థిక సాయం అందుతాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే.. భార్య వద్దన్న తర్వాత మందు తాగడం అనేది డైరెక్ట్ గా నేరం కాకపోవచ్చు. కానీ, తాగిన తర్వాత భార్యపై చెయ్యి చేసుకున్నా, ఆమెను మాటలతో సైకలాజికల్ గా టార్చర్ పెట్టినా మాత్రం చట్టం అసలు వదిలిపెట్టదు. చట్టం దృష్టిలో గృహహింస అనేది ఏ పరిస్థితుల్లో చేసినా తీవ్రమైన నేరమే. మందు అనేది గృహహింసకు ఎప్పటికీ సాకు కాకూడదు. భార్యకు ఇంట్లో సేఫ్టీ, రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నాన్ నెగోషియబుల్ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.