DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎంత పెంచారో తెలుసా?

Published : Sep 25, 2025, 03:18 PM IST

DA Hike :  ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వాలు దసరా కానుకలు ఇస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో సింగరేణి ఎంప్లాయిస్ కు బోనస్ ప్రకటించగా, త్రిపుర సర్కార్ డీఏ పెంచింది.  మరి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పండగ కానుక ప్రకటిస్తుందేమో చూడాలి.   

PREV
15
పండక్కి ముందే డీఏ పెంపు ఉంటుందా?

DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాదు పెన్షనర్లు కూడా తమ తదుపరి డీఏ/డిఆర్ పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండుగ సీజన్ సందర్భంగా దీపావళికి ముందే డీఏ/డీఆర్ పెంపు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వ వర్గాల నుండి కూడా సంకేతాలు అందుతున్నాయి… దీంతో ఉద్యోగులు ఆశతో ఉన్నారు.

గతేడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2% డీఏ/డిఆర్ పెంచింది. ఇది జనవరి 1, 2025 నుండి అమలు చేస్తున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం 55% డీఏ/డీఆర్ పొందుతున్నారు. ఇలా ఉద్యోగులకే కాదు పెన్షనర్లకు కూడా డీఏ పెరిగింది..మరి ఈసారి ఎంత పెంచుతారన్నది ఆసక్తికరంగా మారింది.

25
ఆ రాష్ట్రం డీఏ పెంచేసిందగా...

ఇదిలావుంటే తాజాగా దేశంలోని ఓ రాష్ట్రం పండగవేళ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది… రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు దేవీ నవరాత్రుల, దసరా కానుకగా డీఏ పెంచింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేవు. ఇంతకూ ఆ రాష్ట్రమేది? డీఏ ఎంత పెంచారు? అనేది తెలుసుకుందాం.

35
త్రిపుర ఉద్యోగులకు డీఏ పెంపు

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురలో ప్రభుత్వ ఉద్యోగులకు పండక్కి ముందే గుడ్ న్యూస్ అందింది. మంగళవారం స్వయంగా ముఖ్యమంత్రి మాణిక్ సాహ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు DA/DR(Dearness Allowance/Dearness Lelief) 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దసరా పండగ కానుకగా ఉద్యోగులకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం వెల్లడించారు.

45
అక్టోబర్ నుండే జీతాల పెంపు

వచ్చేనెల (అక్టోబర్ 1) నుండే డీఏ/డీఆర్ పెంపు అమలులోకి వస్తుందని... వాటి ప్రకారమే ఉద్యోగులు జీతాలు, పెన్షనర్లు పెన్షన్ పొందుతారని సీఎం మాణిక్ సాహా వెల్లడించారు. ఈ నిర్ణయంతో 1,05,739 మంది ఉద్యోగులు, 84,342 మంది పెన్షనర్లు లాభపడతారని... కానీ ప్రభుత్వానికి అదనంగా రూ.125 కోట్ల భారం పడుతుందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా త్రిపుర ప్రభుత్వం తమ ఉద్యోగులకు వరుసగా డీఏ పెంపును అందిస్తోంది.

55
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఎంత పెరుగుతుందో?

తాజా డీఏ/డిఆర్ పెంపుతో త్రిపుర ప్రభుత్వ ఉద్యోగులు 36 శాతం డీఏ పొందుతారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 52 శాతం డీఏ పొందుతున్నారు. అయితే త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగే అవకాశాలున్నాయి. ఎంత పెరుగుతుందో అని ఉద్యోగులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories