భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవాలనుకునేవారికి ప్రైవేట్ సంస్థల మీద నమ్మకం తక్కువ. అందుకే చాలామంది కేంద్ర ప్రభుత్వం అందించే సేవింగ్ స్కీమ్స్ లో చేరుతున్నారు. ఇవి సురక్షితమే కాదు మంచి లాభాలనూ అందిస్తాయి. ఇలాంటి పొదుపు పథకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు కోసం కొంత డబ్బు దాచుకోవాలని ఉంటుంది. కానీ ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలను, కో-ఆపరేటివ్ సొసైటీలను నమ్మలేం. తక్కువ టైంలో ఎక్కువ వడ్డీ పేరుతో మోసం చేసే సంస్థలు చాలా పుట్టుకొస్తున్నాయి… ఇవి సేఫ్ కాదు. అలాగని డబ్బులు సేవ్ చేయకుండా ఉండటం కూడా మంచిదికాదు. ఇలా డబ్బులు సేవ్ చేయాలి... కానీ అవి సురక్షితంగా ఉండాలి అంటే కేంద్ర ప్రభుత్వం అందించే సేవింగ్ స్కీమ్స్ బెటర్. ఇలాంటి 9 సురక్షితమైన పొదుపు పథకాల సమాచారం ఇక్కడ అందిస్తున్నాం.
210
1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న దీర్ఘకాలిక, పన్ను రహిత పొదుపు పథకం. దీని కాలపరిమితి 15 ఏళ్లు. ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం 7.1% వడ్డీ రేటు ఉంది. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉండటంతో ఇది చాలా పాపులర్ అయింది.
310
2. సుకన్య సమృద్ధి యోజన (SSY)
ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పొదుపు పథకాన్ని తీసుకొచ్చింది. 10 ఏళ్లలోపు ఆడపిల్ల పేరు మీద తల్లిదండ్రులు పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో అకౌంట్ తెరవొచ్చు. ఏడాదికి కనీసం రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. దీనికి 8.2% వడ్డీ, 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఇది 60 ఏళ్లు దాటిన రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సురక్షితమైన పెట్టుబడి పథకం. ప్రస్తుతం దీనిపై ఏటా 8.2% వడ్డీ (ప్రతి మూడు నెలలకు చెల్లిస్తారు) ఇస్తున్నారు. 5 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఈ స్కీమ్‌లో గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఇది పన్ను ఆదాతో పాటు కచ్చితమైన ఆదాయాన్ని అందిస్తుంది.
510
4. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)
ఇది కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్న సురక్షితమైన, స్థిర-ఆదాయ చిన్న పొదుపు పథకం. దీని మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు. ప్రస్తుతం ఏటా 7.7% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
610
5. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)
రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఆదాయం కోసం భారత ప్రభుత్వం ఈ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది మార్కెట్‌తో ముడిపడి ఉంటుంది. 18-70 ఏళ్ల మధ్య వయసున్న ఏ భారతీయ పౌరుడైనా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. పన్ను ఆదా, దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఇది ఉపయోగపడుతుంది.
710
6. కిసాన్ వికాస్ పత్ర (KVP)
మీ పెట్టుబడిని నిర్ణీత సమయంలో రెట్టింపు చేసే గ్యారెంటీ ఉన్న పథకం ఇది. కేంద్ర ప్రభుత్వ పోస్టాఫీస్ పొదుపు పథకమైన ఇది, పెట్టిన డబ్బును 115 నెలల్లో (9 ఏళ్ల 7 నెలలు) డబుల్ చేస్తుంది. 18 ఏళ్లు దాటిన వారు, జాయింట్ అకౌంట్ లేదా మైనర్ల పేరు మీద కూడా తీసుకోవచ్చు. దీనికి 80C పన్ను మినహాయింపు వర్తించదు.
810
7. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)
ఇది ప్రతినెలా గ్యారెంటీ ఆదాయం ఇచ్చే సురక్షితమైన ప్రభుత్వ పొదుపు పథకం. 5 ఏళ్ల కాలపరిమితికి ఏటా 7.4% వడ్డీ రేటుతో నెలనెలా ఆదాయం అందిస్తుంది. ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు (జాయింట్ అకౌంట్‌కు కూడా) పెట్టుబడి పెట్టొచ్చు. 10 ఏళ్లు దాటిన మైనర్లతో సహా ఎవరైనా ఖాతా తెరవొచ్చు.
910
8. సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB)
భౌతిక బంగారానికి బదులుగా ఆర్‌బీఐ జారీ చేసే సురక్షితమైన ప్రత్యామ్నాయం ఇది. 8 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది (5 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు). ఏటా 2.5% వడ్డీతో పాటు, బంగారం ధర పెరుగుదల లాభం కూడా లభిస్తుంది. కనీసం 1 గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కేజీల (వ్యక్తులకు) వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
1010
9. అటల్ పెన్షన్ యోజన (APY)
అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం భారత ప్రభుత్వం ఈ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న బ్యాంకు ఖాతాదారులు ఇందులో చేరొచ్చు. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు గ్యారెంటీ పెన్షన్ లభిస్తుంది