మహారాష్ట్రలో 58-61 శాతం మంది ముంబై, నాగ్‌పూర్ వంటి నగరాల్లో స్లాంగ్ రూపంలో అసభ్య పదజాలం వాడుతున్నారు. గుజరాత్‌లో 55-58 శాతం మంది తిట్లను ఉపయోగిస్తుండగా, మధ్యప్రదేశ్ (48-55%), ఉత్తరాఖండ్ (45%) రాష్ట్రాల్లో ఈ ప్రభావం కొంత తక్కువగా ఉంది. ఈ సర్వే ప్రధానంగా హిందీ, దాని మాండలికాలు మాట్లాడే ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇతక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా తిట్లను మాట్లాడుతారని తేలింది. ఏపీ 14వ స్థానంలో ఉండగా, ఇక్కడ 39 శాతం తిట్లు మాట్లాడుతారని తేలింది. ఇక తెలంగాణ 15వ స్థానంలో ఉంది. ఇక్కడ 38 శాతం అసభ్య పదజాలం మాటల్లో ఉంటోందని సర్వేలో వెల్లడైంది.
అత్యంత గౌరవప్రదమైన రాష్ట్రం ఏది?
దేశం మొత్తం ఒకవైపు ఉంటే, జమ్మూ కశ్మీర్ మరోవైపు నిలిచింది. ఈ జాబితాలో కశ్మీర్ కేవలం 15 శాతంతో చివరి స్థానంలో ఉంది. అక్కడ రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ, ప్రజలు తమ భాషలో మాత్రం ఎంతో మర్యాదను, సంయమనాన్ని పాటిస్తారని సర్వే కొనియాడింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో 20-30 శాతం మాత్రమే తిట్ల వినియోగం ఉంది. అక్కడ మహిళలకు ఇచ్చే గౌరవం, మాతృస్వామ్య ప్రభావం వల్ల భాషాలో అసభ్య పదజాలం వాడకం తక్కువగా ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.