రాజస్థాన్‌లో తప్పకుండా చూడాల్సిన టాప్ 5 పర్యాటక ప్రదేశాలివే

First Published | Aug 22, 2024, 6:38 PM IST

భారతదేశంలో పర్యాటక ప్రదేశాలకు నిలయం రాజస్థాన్.  అక్కడ చారిత్రక కట్టడాల అందాలకు ప్రతిఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఇలా రాజస్థాన్ లో తప్పకుండా చూడాల్సిన టాాప్ 5 ప్రదేశాలివే... 

జైపూర్ సిటీ

రాజస్థాన్ లో తప్పకుండా చూడాల్సిన నగరం జైపూర్. పింక్ సిటీగా ప్రసిద్ది చెందిన ఈ నగరం ఘన చరిత్రను కలిగివుంది. అందువల్లే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా జైపూర్ నిలిచింది. అమెర్ ఫోర్ట్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, జంతర్ మంతర్, జల్ మహల్, సిటీ ప్యాలెస్, మోతీ డుంగ్రీ గణేష్ టెంపుల్, నహర్‌ఘర్ ఫోర్ట్ జైపూర్ లో సందర్శనీయ ప్రదేశాలు. ఇక విలాసవంతమైన హోటల్లు, స్థానిక వంటకాలను వడ్డించే రెస్టారెంట్లకు ఇక్కడ కొదవేలేదు, 
 

ఉదయపూర్ సిటీ ప్యాలెస్

ఉదయపూర్‌లోని సిటీ ప్యాలెస్ అందాలు మిమ్మల్ని మైమరిపిస్తాయి... ఆ అందమైన బాల్కనీల్లోంచి చూస్తే ఉదయపూర్ పట్టణం మరింత అందంగా కనిపిస్తుంది. ఎత్తైన గుమ్మటాలు, అద్భుతమైన రాజభవనం ఉదయ్ పూర్ అందాలను రెట్టింపుచేసింది. సిటీ ప్యాలెస్ యొక్క రంగురంగుల కిటికీలు, రాజభవన దృశ్యాలు మిమ్మల్ని రాజుల కాలంలోకి తీసుకుని వెళతాయి. 

Latest Videos


ఉదయపూర్ సిటీ ప్యాలెస్

రాజస్థాన్‌లోని రణతంబోర్‌ జంగిల్ సఫారీ మీకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం. అలాగే అద్భుతమైన జాతీయ ఉద్యానవనం, చారిత్రాత్మక కోటను కూడా సందర్శించవచ్చు. ఇక్కడి అందమైన సరస్సు ఖచ్చితంగా మీ హృదయాన్ని ఆకట్టుకుంటుంది. 

పుష్కర్ బ్రహ్మ దేవాలయం

పుష్కర్‌లోని బ్రహ్మ దేవాలయం తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం.  ఇక్కడే ఫోయ్ సాగర్ సరస్సు యొక్క అందమైన దృశ్యాన్ని కూడా మీరు ఆస్వాదించవచ్చు. ఇక్కడి నుండి, మీరు అరావళి పర్వతాల యొక్క అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు.

అజ్మీర్ షరీఫ్ దర్గా

అజ్మీర్ పేరు చెప్పగానే సూఫీ సాధువు మొయినుద్దీన్ చిస్తి దర్గా గుర్తుకువస్తుంది. ఈ దర్గా యొక్క ప్రత్యేకత ఏమిటంటే కేవలం ముస్లింలే కాదు అన్ని మతాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. కోరికలు నెరవేరినవారు సంతోషంగా చాదర్‌లను సమర్పిస్తారు. అజ్మీర్‌ దర్గా చాలా మహిమ కలిగిందని విశ్వసిస్తుంటారు. 

click me!