77 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా బ్రిటిష్ నియంత్రణలో ఉన్న రైల్వే మార్గం.. ఇండియాలో ఎక్కడో తెలుసా?

First Published Aug 22, 2024, 11:56 AM IST

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ ఒక రైల్వే మార్గం బ్రిటిష్ కంపెనీ నియంత్రణలోనే ఉంది. భారతీయ రైల్వే ఈ మార్గాన్ని కొనుగోలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు.

బ్రిటిష్ యాజమాన్యంలోని రైల్వే మార్గం

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ, మహారాష్ట్రలోని ఒక రైల్వే మార్గాన్ని ఇప్పటికీ ఒక బ్రిటిష్ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ రైల్వే మార్గాన్ని కొనుగోలు చేయడానికి భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేసినా అవి విజయవంతం కాలేదు. సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ బ్రిటిష్ కంపెనీ అయిన ‘కిల్లిక్ నిక్సన్ & కో’ కంపెనీయే ఇంకా నిర్వహిస్తోంది.

భారతీయ రైల్వేలు

ఈ కంపెనీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ముర్తాజాపూర్ వరకు ఉన్న 190 కిలోమీటర్ల రైలు మార్గంలో శకుంతల ఎక్స్‌ప్రెస్‌ను నడిచేది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు భారతదేశం నుంచి వెళ్లిపోయారు. అయినా, ఈ మార్గంపై బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ అధికారం కొనసాగుతోంది. ఆ కంపెనీకి భారతీయ రైల్వే రూ.1.20 కోట్ల రాయల్టీ చెల్లిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

Latest Videos


శకుంతల రైలు మార్గం

అమరావతి నుంచి ముర్తాజాపూర్ వరకు ఉన్న 190 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైల్వే మార్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేసింది. అయితే, అవి విజయవంతం కాలేదు. ఈ రైలు మార్గంలో శకుంతల ప్యాసింజర్ అనే ఒకే ఒక ప్రయాణికుల రైలు నడిచేది. దీంతో ఈ మార్గాన్ని శకుంతల రైలు మార్గం అని పిలుస్తారు. శకుంతల ఎక్స్‌ప్రెస్ అచల్‌పూర్, యావత్మల్ మధ్య 17 స్టేషన్లలో ఆగేది. దాదాపు 70 సంవత్సరాలు ఈ రైలు ఆవిరి ఇంజిన్‌తో నడిచింది.

భారతీయ రైల్వేల గురించి ఆసక్తికరమైన విషయాలు

శకుంతల ప్యాసింజర్ రైలుకి 1994లో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఆ తర్వాత అనుకోని కారణాలతో రైలును నిలిపివేశారు. దీనిని తిరిగి ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 5 బోగీలున్న ఈ రైలు ప్రతిరోజూ 800 నుండి 1,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేది. భారతీయ రైల్వే 1951లో జాతీయం అయింది. ఈ రైలు మార్గం మాత్రం భారత ప్రభుత్వ అధికార పరిధిలోకి రాలేదు.

శకుంతల రైల్వే మార్గం

అమరావతి- ముర్తాజాపూర్ రైలు మార్గాన్ని ఉపయోగించుకున్నందుకు ఇంగ్లండ్ కంపెనీకి రూ.1.20 కోట్ల రాయల్టీని ఇండియన్ రైల్వే చెల్లించేది. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

రైల్వేలు

మహారాష్ట్రలోని అమరావతిలో పత్తిని పండిస్తారు. పత్తిని అమరావతి నుంచి ముంబయి ఓడరేవుకు తరలించడానికి బ్రిటిష్ వారు ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. సెంట్రల్ ప్రావిన్సెస్ రైల్వే కంపెనీ (CPRC) ఈ రైల్వేను నిర్మించడానికి బ్రిటన్‌కు చెందిన కిల్లిక్ నిక్సన్ & కోని స్థాపించింది.

శకుంతల ఎక్స్‌ప్రెస్

ఈ రైలు మార్గం నిర్మాణం 1903లో ప్రారంభమై.. 1916లో పూర్తయింది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారతీయ రైల్వే ఈ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్ల, ఈ మార్గాన్ని ఉపయోగించుకున్నందుకు ప్రతి సంవత్సరం కంపెనీకి రాయల్టీ చెల్లించాల్సి వచ్చేది.

click me!