మధపర్ గ్రామంలో ఎన్నివేల కోట్లున్నాయో తెలుసా?
గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది ఈ మధపర్ గ్రామం. ఒకప్పుడు ఇదికూడా దేశంలోని అన్ని గ్రామాల మాదిరిగానే ఉండేది. కానీ అక్కడి ప్రజలు తమ కష్టంతో తలరాతను మార్చుకున్నారు. తమ పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేసారు... వారే ఇప్పుడు ఆ గ్రామాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు.
మధాపర్ గ్రామానికి చెందిన చాలామంది విదేశాల్లో స్థిరపడ్డారు. అక్కడ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ మంచి స్థానంలో ఉన్నారు. ఏ దేశానికి వెళ్లినా తమ గ్రామాన్ని మాత్రం మరిచిపోలేదు... తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు డబ్బులు పంపించడమే కాదు గ్రామాభివృద్ధి తమవంతు సాయం చేస్తున్నారు. ఇలా ఎన్ఆర్ఐలు, గ్రామస్తులు కలిసికట్టుగా మధపర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు.
ప్రస్తుతం మధపర్ గ్రామంలో ఆసియాలోనే ధనిక గ్రామంగా గుర్తింపుపొందింది. ఈ గ్రామంలో ఏకంగా రూ.70,00,000,000,00 ఫిక్సుడ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇలా కేవలం భారతదేశంలోనే కాదు ఆసియాలోనే ధనిక గ్రామంగా నిలిచింది. ఓ గ్రామంలో ఇంత డబ్బు ఉందని తెలిసి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోతోంది.