Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

Published : Oct 04, 2025, 07:19 PM IST

Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

PREV
15
Hyderabad : హైదరాబాద్‌ లో అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌ ప్రాజెక్ట్‌లు

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెండు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది. ప్యారడైజ్‌–బోయిన్‌పల్లి కారిడార్‌–1ను రూ.1,580 కోట్లతో డబుల్‌ డెక్కర్‌ రూపంలో నిర్మించనున్నారు. జేబీఎస్‌–శామీర్‌పేట కారిడార్‌–2లో 18.10 కి.మీ. పొడవున 500 మీటర్ల అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌ నిర్మించనున్నారు. రూ.2,232 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులకు కావాల్సిన భూముల్లో 90% సేకరణ పూర్తయింది. నవంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇరుప్రాజెక్టులు పూర్తైతే నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

25
Vijayawada: "ఆటో డ్రైవర్ల సేవలో" పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విజయవాడలోని బసవపున్నయ్య స్టేడియంలో సీఎం చంద్రబాబు ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు సంవత్సరానికి రూ.15 వేల ఆర్థికసాయం అందజేశారు. 

తొలి విడతగా 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. వీరిలో 2.64 లక్షల ఆటో డ్రైవర్లు, 20,072 ట్యాక్సీ డ్రైవర్లు, 6,400 మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు.

35
మావోయిస్టులకు మరో ఛాన్స్ లేదు.. : హోంమంత్రి అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బస్తర్‌లో మాట్లాడుతూ మావోయిస్టులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆయుధాలు వదిలి లొంగిపోతే ప్రభుత్వం స్వాగతిస్తుందని, పునరావాసం కల్పిస్తుందని తెలిపారు. అయితే ఇకపై మావోయిస్టులతో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. 

2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మారుస్తామని ప్రకటించారు. మోదీ ప్రభుత్వం గత దశాబ్దంలో ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధికి రూ.4లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే వారిపై భద్రతా దళాలు కఠిన చర్యలు తీసుకుంటాయని ఆయన హెచ్చరించారు.

45
ట్రంప్‌ను లెక్కచేయని ఇజ్రాయెల్‌.. గాజాపై మళ్లీ వైమానిక దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధం ఆపాలని సూచించినా, ఇజ్రాయెల్‌ లెక్కచేయలేదు. మరోసారి గాజాపై బాంబు దాడులు చేసింది. శనివారం జరిగిన వైమానిక దాడుల్లో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 

హమాస్‌ బందీల విడుదలకు అంగీకరించిన నేపథ్యంలో ట్రంప్‌ గాజాపై దాడులు ఆపాలని ట్రూత్‌ సోషల్‌లో పిలుపునిచ్చారు. అయితే ఇజ్రాయెల్‌ స్పందించకపోవడం గమనార్హం. ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికను అంగీకరించినట్లు నెతన్యాహు ప్రకటించిన కొద్దిసేపటికే కొత్త దాడులు చేయడం గమనార్హం.

55
India : రోహిత్ శర్మకు షాక్.. ఆసీస్ సిరీస్ కు భారత జట్టుకు కెప్టెన్ గా గిల్

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ నియమించింది. రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించారు. రోహిత్‌ ఇప్పుడు కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే కొనసాగనున్నారు. 2027 ప్రపంచకప్‌ ప్రణాళికల్లో భాగంగా గిల్‌ను భవిష్యత్‌ నాయకుడిగా తీర్చిదిద్దాలని బీసీసీఐ నిర్ణయించింది.

వన్డే సిరీస్‌ కోసం జస్ప్రిత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి, ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్షదీప్‌ సింగ్‌లను చేర్చారు. రిషబ్‌ పంత్‌ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో సిరీస్‌ నుంచి దూరంగా ఉంచారు. అక్టోబర్‌ 19 నుంచి భారత్‌–ఆస్ట్రేలియా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నాయి. ఈ పర్యటనను 2027 ప్రపంచకప్‌ సన్నాహకంగా బీసీసీఐ చూస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి

Read more Photos on
click me!

Recommended Stories