Tenant Rights : మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా..? అయితే మీ హక్కులేంటో తప్పకుండా తెలుసుకొండి

Published : Dec 25, 2025, 08:36 PM IST

Tenant Rights : ఇంటి యజమాని అద్దెకున్నవారి పోర్షన్ కి కరెంట్ కట్ చేయవచ్చా? ఈ విషయంలో తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే అద్దెకుండేవారి హక్కులపై పెద్ద చర్చ జరుగుతోంది. వాటిగురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

PREV
18
అద్దెదారులు... మీ హక్కులు తెలుసుకొండి

Tenant Rights : మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే ఎప్పుడైనా ఇంటి యజమాని కోపంతో మీ కరెంట్ లేదా నీళ్లు ఆపేస్తాడేమో అని భయపడుతున్నారా? అయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. ఢిల్లీ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో కరెంట్ అనేది సౌకర్యం కాదు, ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ఇంటి యజమాని, అద్దెదారు మధ్య కేసు నడుస్తున్నా సరే అద్దెదారులను చీకట్లో ఉంచలేరు... కరెంట్ కట్ చేయలేరని స్పష్టం చేసింది. డిసెంబర్ 15, 2025న వచ్చిన ఈ తీర్పు వేలాది మంది అద్దెదారులకు, ముఖ్యంగా చాలాకాలంగా అద్దె ఇళ్లలో ఉంటూ ఏదో ఒక చట్టపరమైన వివాదంలో చిక్కుకున్న వారికి పెద్ద ఊరటనిచ్చింది.

28
అసలు ఏమిటీ కేసు...

ఈ కేసులో ఓ వ్యక్తి 2016 నుంచి ఢిల్లీలోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు… మూడో అంతస్తులో నివసిస్తున్నాడు. కొంతకాలం ఆర్థిక ఇబ్బందుల వల్ల అతను అద్దె, కరెంట్ బిల్లు సరైన సమయానికి కట్టలేకపోయాడు. ఆ తర్వాత ఇంటి యజమాని బకాయి ఉన్న అద్దె వసూలు చేయడానికి కోర్టులో కేసు వేశాడు, అది ఇంకా నడుస్తోంది. 

ఇలాకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో విద్యుత్ పంపిణీ సంస్థ BSES అతడి పోర్షన్ కి కరెంట్ కనెక్షన్‌ను కట్ చేసింది. ఇంటి యజమాని నుంచి NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) తెస్తేనే మళ్లీ కనెక్షన్ ఇస్తామని చెప్పింది. యజమాని NOC ఇవ్వడానికి నిరాకరించాడు, అంతేకాదు నీటి సరఫరా కూడా ఆపేశాడు, కరెంట్ మీటర్‌కు తాళం వేశాడు. అద్దెదారు తర్వాత మొత్తం బకాయి కరెంట్ బిల్లు చెల్లించినా, కరెంట్ మళ్లీ ఇవ్వలేదు. దీంతో అతను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.

38
కోర్టులో అద్దెదారు ఏం వాదించారు?

తాను చాలా ఏళ్లుగా చట్టబద్ధంగా ఆ ఇంట్లో ఉంటున్నానని అద్దెదారు కోర్టుకు తెలిపాడు. కరెంట్ మీటర్ యజమాని పేరు మీద ఉన్నా కరెంట్ వాడింది తనే, బిల్లులు కూడా తనే కడుతున్నానని తెలిపాడు. బకాయి ఉన్న బిల్లు కూడా చెల్లించేశాక కరెంట్ కట్ చేసి ఉంచడం పూర్తిగా తప్పు… కేవలం NOC లేదన్న కారణంతో కరెంట్ ఆపడం చట్టవిరుద్ధం అని వాదించారు.

48
BSES ఏం చెప్పింది?

ఇంటి యజమాని మీటర్‌కు తాళం వేశారని… అతని అనుమతి లేకుండా కరెంట్ పునరుద్ధరించడం సాధ్యం కాదని విద్యుత్ సంస్థ BSES కోర్టుకు తెలిపింది అలాగే కరెంట్ ఇవ్వొద్దని యజమాని లిఖితపూర్వకంగా చెప్పాడని కూడా తెలిపారు విద్యుత్ అధికారులు.

58
ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది?

ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే కరెంట్ అనేది జీవితంలో ఒక ప్రాథమిక భాగం, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లభించే జీవించే హక్కు, గౌరవంతో ముడిపడి ఉంది. కోర్టు తుది తీర్పు ఇచ్చేంత వరకు అద్దెదారు ఆ ఇంట్లో ఉండటాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించలేమని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో యజమాని, అద్దెదారు మధ్య నడుస్తున్న కేసు కరెంట్ లాంటి ప్రాథమిక సౌకర్యాన్ని ఆపడానికి కారణం కాలేదు. ఏ పౌరుడి నుంచైనా కరెంట్ లాంటి అవసరమైన సౌకర్యాన్ని లాక్కొని ఒత్తిడికి గురిచేయలేరని కోర్టు చెప్పింది.

68
అద్దెదారు ఈ కేసు ఎందుకు గెలిచాడు?

న్యాయ నిపుణుల ప్రకారం... ఈ కేసులో ముఖ్యమైన విషయం ఏంటంటే అద్దెదారు చాలా కాలంగా చట్టబద్ధంగా ఆ ఇంట్లో నివసిస్తున్నాడు, కరెంట్ బకాయిలు కూడా చెల్లించేశాడు. కేవలం యజమాని NOC లేదన్న కారణంతో కరెంట్ ఆపడాన్ని కోర్టు అంగీకరించలేదు. వ్యక్తిగత వివాదాలను అద్దెదారుపై ఒత్తిడి తెచ్చే ఆయుధంగా వాడుకోలేరని కోర్టు స్పష్టం చేసింది.

78
కోర్టు తుది ఆదేశం ఏంటి?

ఢిల్లీ హైకోర్టు BSES అధికారులకు డిసెంబర్ 19, 2025న అక్కడికి వెళ్లి కరెంట్ కనెక్షన్‌ను పునరుద్ధరించాలని ఆదేశించింది. అవసరమైతే స్థానిక పోలీసుల సహాయం కూడా తీసుకోవచ్చు. కరెంట్ ఇవ్వడానికి యజమాని NOC అవసరం లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే అద్దెదారు భవిష్యత్తులో కరెంట్ బిల్లు కట్టకపోతే, కరెంట్ కట్ చేసే హక్కు కంపెనీకి ఉంటుందని చెప్పింది. అలాగే ఈ ఆదేశం అద్దెదారుకు ఇంటిపై యాజమాన్య హక్కు ఇవ్వదని, నడుస్తున్న ఇతర కేసులను ప్రభావితం చేయదని కూడా స్పష్టం చేసింది.

88
మీకు కూడా ఇలా జరిగితే ఏం చేయాలి?

ఈ తీర్పు స్పష్టంగా చెబుతోంది ఏంటంటే, మీరు చట్టబద్ధంగా ఒక ఇంట్లో ఉంటూ, కరెంట్ బిల్లులు కడుతుంటే ఎవరూ మీ కరెంట్‌ను ఆపలేరు. యజమాని కోపం, NOC లేదా కోర్టు కేసు, ఏదీ కరెంట్ కట్ చేయడానికి సరైన కారణం కాదు. ఒకవేళ యజమాని మీ కరెంట్ లేదా నీళ్లు ఆపేస్తే, ముందుగా మీ బిల్లులన్నీ క్లియర్‌గా ఉంచుకోండి. ఆ తర్వాత విద్యుత్ కంపెనీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. అప్పటికీ స్పందన లేకపోతే మీరు కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories