ఇంట్లో ఎంత ఆల్క‌హాల్ ఉండొచ్చు.? న్యూ ఇయ‌ర్ దావ‌త్ వేళ ఈ విష‌యాలు క‌చ్చితంగా తెలుసుకోండి

Published : Dec 25, 2025, 10:33 AM IST

New Year: కొత్తేడాదికి వెల్‌క‌మ్ చెప్పేందుకు అంతా సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక మందు బాబులైతే ఇప్ప‌టి నుంచే ప్లాన్స్ వేస్తున్నారు. అయితే చ‌ట్ట‌ప‌రంగా ఇంట్లో ఎంత ఆల్క‌హాల్ ఉండొచ్చు.? ఎక్కువ‌గా ఉంటే ఏం జ‌రుగుతుంది.? లాంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
న్యూ ఇయర్ పార్టీకి ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్న వేళ ఇళ్లలో పార్టీ ప్లాన్లు ఊపందుకుంటున్నాయి. స్నేహితులు, సంగీతం, సందడి మధ్య చాలామంది ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఇంట్లో ఉంచే ఆల్క‌హాల్‌ చట్టపరంగా సమస్య అవుతుందా అన్నది. ఒక అదనపు బాటిల్ ఆనందం ఇవ్వాల్సిన పార్టీని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది. అందుకే వేడుకలకు ముందు నిబంధనలు తెలుసుకోవడం అవసరం.

25
ఆల్క‌హాల్ నిబంధనలు ఎవరు నిర్ణయిస్తారు?

భారత్‌లో ఆల్క‌హాల్‌ సంబంధిత చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా ప్రకారం మద్యం నియంత్రణ ప్రతి రాష్ట్రానికి విడిగా ఉంటుంది. అందువల్ల ఒక రాష్ట్రంలో అనుమతించే పరిమితి, మరో రాష్ట్రంలో నేరంగా మారవచ్చు. మీరు నివసిస్తున్న రాష్ట్రంలో ఎంత మందు ఇంట్లో ఉంచుకోవచ్చో ముందే తెలుసుకోవాలి.

35
మద్యం పూర్తిగా నిషేధించిన రాష్ట్రాలు

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆల్క‌హాల్‌ తాగడం, ఉంచడం రెండూ నేరం. బీహార్‌లో 2016 నుంచి సంపూర్ణ ఆల్క‌హాల్ నిషేధం అమల్లో ఉంది. గుజరాత్‌లో కూడా నిషేధమే, అయితే పర్యాటకులకు ప్రత్యేక పర్మిట్ ఉంటుంది. నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లోనూ నిషేధం కొనసాగుతోంది. మణిపూర్‌లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సడలింపు ఉంది. లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఆల్క‌హాల్‌ నిషేధం అమల్లో ఉంది, బంగారాం దీవిలో మాత్రం పర్యాటకులకు పరిమిత అనుమతి ఉంది.

45
ఢిల్లీ, హర్యానా, యూపీ నిబంధనలు

ఢిల్లీలో నిబంధనలు కొంత సడలింపుగా ఉన్నాయి. 25 ఏళ్లు నిండిన వ్యక్తి ఇంట్లో మొత్తం 18 లీటర్ల వరకు ఆల్క‌హాల్‌ ఉంచుకోవచ్చు. అందులో హార్డ్ డ్రింక్స్‌కు గరిష్టంగా 9 లీటర్లు మాత్రమే అనుమతి. ఒకే ఇంట్లో నివసించే ప్రతి పెద్దవాడు తన పరిమితి వరకు ఉంచుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. హర్యానాలో దేశీ మందు 6 బాటిళ్లు, ఐఎంఎఫ్ఎల్ మొత్తం 18 బాటిళ్లు ఉంచుకోవచ్చు. యూపీలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. లైసెన్స్ లేకుండా 1.5 లీటర్ల విదేశీ ఆల్క‌హాల్‌, 6 లీటర్ల బీర్ మాత్రమే అనుమతి ఉంటుంది.

55
ఇతర రాష్ట్రాల్లో ఎంత వరకు అనుమతి ఉంది?

పంజాబ్‌లో పరిమిత సంఖ్యలో ఐఎంఎఫ్ఎల్, బీర్, దేశీ మందు ఉంచుకోవచ్చు. రాజస్థాన్‌లో సుమారు 9 లీటర్ల ఐఎంఎఫ్ఎల్ వరకు అనుమతి ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో 48 బాటిళ్ల బీర్, 36 బాటిళ్ల విస్కీ వరకు ఉంచుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో పర్మిట్ లేకుండా మూడు బాటిళ్ల విదేశీ ఆల్క‌హాల్‌, ఆరు బాటిళ్ల బీర్ అనుమతిస్తారు. తెలంగాణ‌లో కూడా దాదాపు ఇదే నిబంధ‌న ఉంది. పశ్చిమ బెంగాల్‌లో ఆరు బాటిళ్ల ఐఎంఎఫ్ఎల్, 18 బాటిళ్ల బీర్ ఉంచుకోవచ్చు. కేరళలో మూడు లీటర్ల ఆల్క‌హాల్‌, ఆరు లీటర్ల బీర్ అనుమతి ఉంది. జమ్మూ కశ్మీర్‌లో 12 బాటిళ్ల ఐఎంఎఫ్ఎల్, 12 బాటిళ్ల బీర్ ఉంచుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories