Tejas Mk1A: తేజ‌స్ జెట్ అనుమానాల‌పై DRDO క్లారిటీ.. అస‌లు విష‌యం ఏంటంటే.?

Published : Jul 03, 2025, 02:48 PM IST

ఇండియ‌న్ ఆర్మీ రూపొందించిన అత్యంత శ‌క్తివంత‌మైన ఫైట‌ర్ జెట్ తేజ‌స్ ఎమ్‌కే1ఏ. ఈ జెట్‌ను భార‌త దేశం స్వ‌యంగా త‌యారు చేసింది. ఈ నేప‌థ్యంలో ఈ జెట్ త‌యారీకి సంబంధించి కొన్ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతోన్న నేప‌థ్యంలో డీఆర్డీఓ క్లారిటీ ఇచ్చింది. 

PREV
15
కీల‌క అప్డేట్

ఇండియా అభివృద్ధి చేసిన తేజస్ Mk1A ఫైటర్‌ జెట్‌కి సంబంధించి డీఆర్‌డీఓ (DRDO) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. తేజస్‌ వేరియంట్‌ జెట్‌లలో ఏ రాడార్‌ను ఉపయోగించబోతున్నారు? ఇజ్రాయిల్‌ తయారీనా? లేక భారతీయంగా అభివృద్ధి చేసిన ఉత్తమ్‌ AESA రాడారా? – అనే అనుమానాలకు డీఆర్‌డీఓ ఛైర్మన్‌ డాక్టర్‌ సమీర్‌ కామత్‌ క్లారిటీ ఇచ్చారు.

25
తేజస్‌ Mk1A రాడార్‌ పై క్లారిటీ

తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొద‌టి 40 తేజస్ Mk1A ఫైటర్‌ జెట్‌లలో ఇజ్రాయిల్‌ ELM-2052 AESA రాడార్‌ను ఫిట్‌ చేస్తాం. కానీ 41వ జెట్‌ నుంచి భారతీయంగా అభివృద్ధి చేసిన ఉత్తమ్‌ AESA రాడార్‌ను అమర్చేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది" అని చెప్పారు.

అయితే ఇప్పటి వరకు వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం.. అన్ని తేజస్ Mk1A జెట్‌లకు కూడా ఇజ్రాయిల్‌ రాడార్‌నే ఉపయోగిస్తారన్న వార్తలు రావడం గమనార్హం. దీంతో ఈ వార్త‌ల‌పై డీఆర్‌డీఓ క్లారిటీ ఇచ్చింది.

35
ఇంత‌కీ రాడార్ ప్రాముఖ్య‌త ఏంటంటే.?

ప్ర‌తీ దేశంలో రాడార్ వ్య‌వ‌స్థ ఉంటుంది. ఈ వ్య‌వ‌స్థ శత్రువులను గుర్తించడంలో, వారిని ట్రాక్ చేయడంలో, ఒకేసారి బహుళ టార్గెట్లను లాక్ చేయడంలో, చాలా దూరంలోకి స్కాన్ చేయడంలో ఉపయోగపడుతుంది.

AESA రాడార్ అంటే ఏంటి?

AESA అంటే Active Electronically Scanned Array. ఇది ఓ మోటార్‌తో తిరిగే డిష్‌లా కాకుండా – వందలాది చిన్న మాడ్యూళ్లతో పనిచేస్తుంది. దీని వల్ల స్కానింగ్ వేగంగా జరుగుతుంది. ఎలక్ట్రానిక్ జామింగ్‌కు తక్కువగా గురవుతుంది

బెంగ‌ళూరు డీఆర్‌డీఓలో ఉత్త‌మ్ AESA రాడార్‌ను అభివృద్ధి చేశారు. ఇది 100 కిలోమీటర్లకు పైగా టార్గెట్లను గుర్తించగలదు. ఒకేసారి 50కిపైగా టార్గెట్లను ట్రాక్ చేయగలదు.

45
మ‌రెందుకు ఇజ్రాయుల్ రాడ‌ర్‌ను ఉప‌యోగించారు.?

భార‌త్ త‌యారు చేసిన ఉత్త‌మ్ AESA అంత మెరుగైంద‌ని చెప్పిన‌ప్పుడు మ‌రి తేజాస్‌లో వీటిని ఎందుకు ఉపయోగించలేదనే సందేహం రావడం కామన్. అయితే ఎయిర్‌ఫోర్స్‌కి ప్రస్తుతం త‌క్ష‌ణ‌మే తేజ‌స్ జెట్‌లు అవ‌స‌రం ఉంది. అందుకే తొలుత నమ్మకమైన ఇజ్రాయిల్‌ రాడార్‌తోనే ప్రారంభించి... తరువాత పూర్తి స్వదేశీ రాడార్‌ల‌ను ఉప‌యోగించాల‌నే ఆలోచ‌న‌తో ఉంది.

55
మొత్తం ఎన్ని జెట్‌లు రానున్నాయి.?

ఇప్పటి వరకు భార‌త్‌ 83 తేజస్ Mk1A జెట్‌లను ఆర్డర్ చేసింది. వీటిలో 73 ఫైటర్స్ + 10 ట్రైనర్లు ఉన్నాయి. తాజాగా మరో 97 జెట్‌ల ఆమోదం కూడా లభించింది మొత్తం 180 తేజస్‌ Mk1A జెట్‌లు ఉండబోతున్నాయి ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో ముందడుగుగా భావిస్తున్నారు. భార‌త ర‌క్ష‌ణ రంగాన్ని బ‌లోపేతం చేయ‌డంతో పాటు, స్వదేశీ పరిజ్ఞానాన్ని అంచెలంచెలుగా అమలు చేయడం ల‌క్ష్యంగా భార‌త్ ముందుకు సాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories