IRCTC: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు.. జూలై 1 నుంచి మార‌నున్న రూల్స్

Published : Jun 16, 2025, 03:42 PM ISTUpdated : Jun 16, 2025, 03:44 PM IST

భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి కొత్త నియమాలు తీసుకువచ్చింది. అకౌంట్‌లో ఆధార్ ధృవీకరణ లేకపోతే, జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్‌ చేయడం సాధ్యం కాదు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి

ఆధార్‌తో లింక్ కాని IRCTC ఖాతాల ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేయడం ఇక సాధ్యపడదు. రైలు ప్రయాణికుల ఐడెంటిటీని నిర్ధారించాల‌నే ఉద్దేశంతో ఈ కొత్త మార్పు తీసుకువచ్చారు. జూలై 15 నుంచి ఆధార్ OTP ధృవీకరణ కూడా తప్పనిసరి చేయ‌నున్నారు.

25
ఏజెంట్లపై పరిమితి

తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే ఏజెంట్లు టికెట్లు బుక్ చేయకుండా ఉండేందుకు, మొదటి 30 నిమిషాల వరకు ఏజెంట్లకు బుకింగ్ నిషేధం ఉంటుంది. సాధారణ ప్రయాణికులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వ‌నున్నారు. దీంతో ప్ర‌యాణికుల‌కు మొద‌టి ప్రాధాన్య‌త ల‌భించ‌నుంది.

35
ఆధార్‌తో లింక్ చేస్తే బుకింగ్‌కు ప్రాధాన్యత

ఆధార్‌తో లింక్ చేసిన ఖాతాలకు తత్కాల్ బుకింగ్ సమయంలో ముందు ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం ఆధార్‌తో లింక్ చేసిన ఖాతాలు ఒక నెలకు 24 టికెట్లు బుక్ చేయగలిగే అవకాశాన్ని కలిగి ఉన్నాయి. ఇదే విధంగా, తత్కాల్ బుకింగ్ మొదటి 10 నిమిషాల్లోనే ఎక్కువ టికెట్లు బుక్ అవుతున్నాయన్నది గణాంకాల ద్వారా వెల్లడైంది.

45
టికెట్ బుకింగ్ అంత వేగంగా ఎలా జరుగుతోంది?

మే 24 నుంచి జూన్ 2 మధ్య కాలంలో 1.08 లక్షల AC టికెట్లలో 62.5% టికెట్లు మొదటి 10 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి. వీటిలో 5615 టికెట్లు మొదటి నిమిషంలోనే, 22,827 టికెట్లు రెండో నిమిషంలో బుక్ అయ్యాయి. స్లీపర్ క్లాస్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

IRCTC అకౌంట్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?

* ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.inలోకి వెళ్లాలి.

* అనంత‌రం 'My Account' విభాగంలోకి వెళ్లండి

* 'Link Your Aadhaar' పై క్లిక్ చేయండి

* ఆధార్ నంబర్, పేరు నమోదు చేసి OTP ని ఎంట‌ర్ చేయండి.

* చివరగా 'Update' పై క్లిక్ చేయండి

55
అస‌లు త‌త్కాల్ టికెట్ అంటే ఏంటి.?

తాత్కాలికంగా ప్రయాణించాల్సిన వారికి ప్రత్యేకంగా ఇచ్చే కోటానే తత్కాల్. ఇది ప్రయాణానికి ముందు రోజు మాత్రమే బుక్ చేయాల్సి ఉంటుంది. AC కోచ్‌ బుకింగ్ ఉదయం 10:00 గంటలకు, స్లీపర్ క్లాస్‌ బుకింగ్ ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుంది.

హ్యాంగ్ అవుతోన్న ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌

తత్కాల్ బుకింగ్ సమయంలో 9 నుంచి 10 లక్షల యూజర్లు ఒకేసారి లాగిన్ అవుతారు. ఈ ట్రాఫిక్ వల్ల IRCTC వెబ్‌సైట్ నెమ్మదిగా పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, భద్రత, పారదర్శకత కోసం ఆధార్ ఆధారిత సిస్టమ్ తీసుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories