Narayana Murthy: దేశంలో పని విధానానికి సంబంధించి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పలుసార్లు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చెప్పిన 996 రూల్‌కి సంబంధించి నెట్టింట చర్చ నడుస్తోంది.
చైనాలో కొన్ని టెక్ కంపెనీలు గత దశాబ్దంలో 9-9-6 పని విధానం పాటించేవి. అంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి 6 రోజులు పని విధానం అన్నమాట. ఇలా మొత్తం 72 గంటల వర్క్ వీక్ అవుతుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల ఆరోగ్యం, కుటుంబ జీవితం దెబ్బతింటుందని తీవ్ర విమర్శలు వచ్చాయి. 2021లో చైనా సుప్రీంకోర్టు ఈ విధానాన్ని నిషేధించింది, కానీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.
25
నారాయణ మూర్తి ఎందుకు ఉదాహరణ ఇచ్చారు?
రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి మరోసారి 72 గంటల వర్క్ వీక్ గురించి మాట్లాడారు. 2023లో “భారత అభివృద్ధికి యువత వారానికి 70 గంటలు పనిచేయాలి” అని చెప్పి పెద్ద చర్చకు తెర తీశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. “చైనాలో 9-9-6 అనేది ఉంది. 9 గంటలకు పని మొదలై, రాత్రి 9 గంటలకు ముగుస్తుంది, వారానికి 6 రోజులు పనిదినాలు ఉంటాయి. మొత్తం 72 గంటలు. భారత యువత కూడా ఇలాగే పని చేయాలి” అన్నారు.
35
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తర్వాత
మూర్తి ఇంకా మాట్లాడుతూ.. “ముందు జీవితాన్ని సెట్ చేసుకోవాలి, తరువాతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచించాలి” అని చెప్పారు. ఈ మాటలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఎక్కువ గంటలు పని చేస్తే ఎదుగుదల, జీతాలు, ఉద్యోగ భద్రత లాంటి అంశాలు నిజంగా మెరుగవుతాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
మూర్తి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. భారత ఉద్యోగులకు ఓవర్‌టైమ్ పే లేకపోవడం, ఎక్కువ పని చేసినా లాభాలు కిందివరికి రాకపోవడం, ఆరోగ్య సమస్యలు పెరగడం, జీతాలు పెద్దగా పెరగకపోవడం, జీవితం మొత్తం పనికే పరిమితం అవ్వడం వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. “యూరప్‌లో 10-5-5 అని అంటారు. 10 నుంచి 5 వరకు, 5 రోజులు పని. సంచారం, స్నేహితులతో గడుపుతారు. జీవితాన్ని ఆస్వాదిస్తారు.” అని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఉద్యోగితో 72 గంటలు పని చేయించి లాభాలు టాప్ మేనేజ్‌మెంట్ పంచుకుంటుంది. ఉద్యోగికి మాత్రం తక్కువ వేతనం ఇస్తారంటూ మరో యూజర్ ప్రశ్నించారు. ఇలా సోషల్ మీడియాలోదికగా పెద్ద డిబేట్ నడుస్తుంది.
55
భారత ఉద్యోగ సంస్కృతిపై కొత్త చర్చ
మూర్తి వ్యాఖ్యలతో భారతదేశంలో మళ్లీ ఒక పెద్ద చర్చ మొదలైంది. దీని వల్ల దేశంలో పని గంటలు, ఉద్యోగుల హక్కులు, పే-స్రక్చర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలపై కొత్తగా వాదనలు మొదలయ్యాయి. యువతలో చాలామంది ఎక్కువ పని గంటలు ఎదుగుదలకు దారి తీస్తాయా? లేక ఆరోగ్య సమస్యలను పెంచుతాయా? అనే ప్రశ్నలు వేస్తున్నారు.