Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో అధికారికంగా ఖాతా ప్రారంభించారు. తన తొలి పోస్టులోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో తనకు ఏర్పడిన పరిచయం, అది ప్రేమగా మారిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు.
త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ నేపథ్యంలో, రాజీవ్‌తో కలిసి గడిపిన మధుర క్షణాలను వివరిస్తూ ఓ వీడియోను పంచుకున్నారు. తమ ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందో అందులో వివరించారు. చదువుకునే రోజుల్లో ఇంగ్లాండ్‌లోని ఆహారం తనకు అంతగా నచ్చేది కాదని, ఇటాలియన్ వంటకాల కోసం వెతుకుతుండగా కేంబ్రిడ్జ్‌లోని ఓ చిన్న గ్రీక్ రెస్టారెంట్ పరిచయమైందని చెప్పారు. ‘వార్సిటీ రెస్టారెంట్’గా పిలిచే ఆ హోటల్‌కు యూరప్‌తో పాటు భారత్‌కు చెందిన విద్యార్థులు కూడా వచ్చేవారని గుర్తుచేసుకున్నారు. అక్కడే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా రాజీవ్ గాంధీతో తనకు పరిచయం ఏర్పడిందని సోనియా వెల్లడించారు. తొలి భేటీలోనే ఆయన తన జీవిత భాగస్వామి కావాలనే భావన కలిగిందని తెలిపారు. రాజీవ్‌కు కూడా తనపై అలాంటి అభిప్రాయమే ఏర్పడిందని ఆ తర్వాత తెలుసుకున్నట్లు వివరించారు.
25
అందం కంటే ఆయన స్వభావమే ఆకట్టుకుంది
రాజీవ్‌తో పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆయన రూపురేఖలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, తనను ఎక్కువగా ఆకట్టుకున్నది ఆయనలోని సౌమ్యత, వినయం అని చెప్పారు. మొదటిసారి కలిసినప్పుడు కలిగిన అనుభూతి ఇప్పటికీ తనకు గుర్తుందని భావోద్వేగంగా వివరించారు.
ఆ రోజుల్లో రాజీవ్‌తో కలిసి విందులు, విహారయాత్రలు, విద్యార్థుల సమావేశాలకు వెళ్లేవారని గుర్తుచేసుకున్నారు. వాలెంటైన్స్ డే వేడుకలోనూ పాల్గొన్నట్లు తెలిపారు. ప్రేమ, నవ్వులు, అనేక మధుర జ్ఞాపకాలతో తమకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నామని ఆమె తన వీడియోలో వివరించారు.
In a small Greek restaurant in Cambridge my journey of love began.
Rajiv and I created a world filled with love, laughter and memories. On 10th November, I share that world with you. https://t.co/zvN5Rqqstf
— Sonia Gandhi (@SoniaGandhi) October 24, 2026
35
నవంబర్ 10న ఆత్మకథ విడుదల
సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం నవంబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే రాజీవ్‌తో తన అనుబంధానికి సంబంధించిన విశేషాలను వీడియో రూపంలో పంచుకున్నారు. పుస్తకం ద్వారా తమ జీవితంలోని ప్రేమ జ్ఞాపకాలను పాఠకులకు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. తన తొలి ఎక్స్ పోస్టులో కేంబ్రిడ్జ్‌లోని చిన్న గ్రీక్ రెస్టారెంట్‌లో మొదలైన ప్రేమ ప్రయాణాన్ని ప్రస్తావించారు. రాజీవ్‌తో కలిసి గడిపిన రోజులు తమ జీవితంలో ప్రత్యేకమైనవని పేర్కొంటూ, నవంబర్ 10న ఆ జ్ఞాపకాల ప్రపంచాన్ని పాఠకులతో పంచుకోనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టగా, ఇప్పుడు ఎక్స్‌లోనూ ఖాతా ప్రారంభించారు. తొలి పోస్టుగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. అందులో రాజీవ్‌తో కలిసి దిగిన ఫొటోలను కూడా ప్రదర్శించారు. రాజకీయ జీవితానికి అతీతంగా తన వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం ద్వారా ఆత్మకథపై ఆసక్తిని పెంచారు.
55
సోనియా, రాజీవ్ ప్రేమకథపై పవన్ ఖేరా స్పందన
సోనియా గాంధీ ఎక్స్‌లోకి రావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా స్పందించారు. రాజీవ్, సోనియాల జీవిత ప్రయాణంలో ప్రేమ, నిబద్ధతతో పాటు విషాదాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వారి ప్రేమకథను వేసవి రాత్రిలో వచ్చే అందమైన కలతో పోల్చారు. ఓ చీకటి విషాదం ఆ కలల ప్రపంచాన్ని కమ్మేసే వరకు వారి ప్రయాణం ఎంతో అందంగా సాగిందని వ్యాఖ్యానించారు. సోనియా పంచుకున్న జ్ఞాపకాలు, త్వరలో విడుదల కానున్న ఆత్మకథ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.