PM Kisan: దీపావళికి ముందే మీ అకౌంట్లోకి డబ్బులు.. గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు

Published : Oct 24, 2026, 09:26 AM IST

PM Kisan 24th Installment Date 2026: పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు అక్టోబర్ 30న విడుదల కానున్నాయి. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా 2,000 రూపాయలు జమ కానుండగా, ఈ-కేవైసీ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
దీపావళికి ముందే అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు దీపావళికి ముందే పెద్ద బహుమతిని అందించేందుకు సిద్ధమైంది. పీఎం కిసాన్ సమ్మన్ నిధికి సంబంధించి చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. పీఎం కిసాన్ యోజన 24వ విడత డబ్బులు అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ శుభవార్తతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పీఎం కిసాన్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు.

25
గత విడత ఎప్పుడు వచ్చింది, ఎందుకు ఆలస్యం?

ఈ పథకానికి సంబంధించి గత 23వ విడత డబ్బులు గత ఏడాది జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఆ తర్వాత నుంచి తదుపరి విడత ఎప్పుడెప్పుడా అని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి దసరా పండుగ సమయంలోనే ఈ సాయం అందుతుందని అందరూ భావించారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో రాలేదు. ఇప్పుడు దీపావళి, ఛత్ మహాపర్వ పండుగలకు సరిగ్గా ముందు కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తుండటంతో రైతుల మొఖాల్లో వెలుగులు నింపుతున్నాయి.

35
నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తం డబ్బులను ప్రతి నాలుగు నెలలకోసారి 2,000 రూపాయల చొప్పున మూడు సమాన విడతలుగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ డీబీటీ విధానం ద్వారా అన్నదాతలకు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా ఆర్థిక భద్రత లభిస్తుంది.

45
ఈ-కేవైసీ, ఆధార్ సీడింగ్ తప్పనిసరి

ఈ పథకం ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా డబ్బులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతులు తమ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం, బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అంతేకాకుండా, ల్యాండ్ వేరిఫికేషన్, ఎన్పీసీఐ మ్యాపింగ్ సరిగ్గా ఉంటేనే నిర్దిష్ట సమయంలో ఖాతాలో డబ్బులు చేరుతాయి. ఒకవేళ ఇవి పూర్తికాకపోతే మీ ఖాతాలో డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది.

55
ఆధార్ లేదా మొబైల్ నంబర్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి.

రైతులు తమ అర్హత స్థితిని అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, బెనిఫిషియరీ స్టేటస్ పేజీని ఓపెన్ చేయాలి. అక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి వివరాలు చూసుకోవచ్చు. అలాగే మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ లేదా ఓటీపీ సాయంతో ఇంట్లోనే ఉండి సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories