Social Media Ban : ఇండియాలో సోషల్ మీడియా బ్యాన్ చేస్తారా..? ఈ కోర్టు సూచనలు ఫాలో అవుతారా..?

Published : Dec 27, 2025, 09:43 AM IST

Social Media Ban in India : సోషల్ మీడియాకు బానిసలై నేటి యువతరం నిర్వీర్యం అయిపోతోంది. అందుకే దీన్ని బ్యాన్ చేయాలని స్వయంగా మద్రాస్ హైకోర్టు సూచించింది. 

PREV
14
ఇండియాలో సోషల్ మీడియా బ్యాన్ డిమాండ్

Social Media Ban : ఈ టెక్నాలజీ యుగంలో అంతా స్మార్ట్ ఫోన్ మయం అయిపోయింది... చిన్నాపెద్ద అని తేడాలేకుండా సోషల్ మీడియకు అలవాటుపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాకు కట్టు బానిసలు అవుతున్నారు. ఏదో సరదాకోసం ప్రారంభించిన సోషల్ మీడియా చివరకు మనల్ని శాసించే స్థాయికి చేరుకుంది, దీనిమాయలో చాలామంది సంసారాలు నాశనం చేసుకుంటున్నారు... డబ్బులు పోగొట్టుకుంటున్నారు... కొన్నిసార్లు ప్రాణాలే పోతున్నారు.

పెద్దల పరిస్థితే ఇలా ఉంటే పిల్లల పరిస్థితి ఇంకెలా ఉంటుంది... సోషల్ మీడియా బారినపడి టీనేజర్స్ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చిన్నారులకు సైతం అశ్లీల కంటెంట్, వీడియోలు చేరుతున్నారు. పిల్లలను సోషల్ మీడియాకు దూరం ఉంచడం తల్లిదండ్రులకు సాధ్యంకావడంలేదు... అందుకే ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. తాజాగా మద్రాస్ హైకోర్టు కూడా ఇలాంటి సూచనలే కేంద్ర ప్రభుత్వానికి చేసింది.

24
ఇంటర్నెట్ పై ఆంక్షలుంటాయా?

స్మార్ట్ ఫోన్ కల్చర్ పెరిగాక పెద్దలే కాదు చిన్నారులు కూడా దానికి బానిస అవుతున్నారు. ఒకప్పుడు చందమామను చూపించి పిల్లలకు గోరుముద్దలు తినిపించే పేరెంట్స్ ఇప్పుడు ఫోన్ చూపిస్తూ తినిపించాల్సిన పరిస్థితి. ఇంతలా ఫోన్ కు అలవాటుపడ్డ చిన్నారులకు ఇంటర్నెట్ లో విచ్చలవిడిగా లభిస్తున్న అశ్లీల వీడియోలు చూసే ప్రమాదముంది. కాబట్టి చిన్నారుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అశ్లీల కంటెంట్ వారికి చేరకుండా ఉండేలా సాప్ట్ వేర్ డెవలప్ చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ తమిళనాడు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయ్యింది. ఎస్. విజయ్ కుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు.

34
సోషల్ మీడియాపై మద్రాస్ హైకోర్టు కామెంట్స్...

చిన్నపిల్లలు ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి దాఖలైన పిటిషన్ మద్రాస్ హైకోర్ట్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రస్తుత సమాజ పోకడపై జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ రామకృష్ణన్ బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ తో పాటు సోషల్ మీడియా చిన్నారుల భవిష్యత్ ను నాశనంచేసేలా ఉందని... ఎందుకు ఆస్ట్రేలియా తరహాలో ఇండియాలో ఆంక్షలు విధించడంలేదని ప్రశ్నించింది. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా ఉపయోగించకూడదు... ఇలాంటి విషయాలను పరిశీలించాలని సూచించారు. చిన్న పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచి వారి బంగారు భవిష్యత్ ను కాపాడాలని న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తికర సూచనలు చేసింది.

44
సోషల్ మీడియాను బ్యాన్ చేస్తారా..?

ఇంతకాలం పేరెంట్స్, సోషల్ యాక్టివిస్ట్ మాత్రమే ఇంటర్నెట్ లో అశ్లీల వీడియోలు, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు న్యాయస్థానాలు కూడా వీటిని పిల్లలకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఈ దిశగా చర్యలు చేపట్టాయి... కొన్నిరకాల వెబ్ సైట్, యాప్స్ పై ఇప్పటికే నిషేదం విధించారు. చైల్డ్ పోర్నోగ్రపీ వీడియోలపై అయితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది... వీటిని రూపొందించి ఇంటర్నెట్ లో పెట్టేవారిపైనే కాదు చూసినవారిపైనా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

అయితే సోషల్ మీడియాను చిన్నారులు ఉపయోగించకుండా బ్యాన్ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ దిశగా ముందడుగు పడలేదు. మరి ఇప్పుడు మద్రాస్ హైకోర్ట్ సూచనలతో అయినా ఈ దిశగా చర్యలుంటాయేమో చూడాలి. కేవలం కేంద్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిన్నారులు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఇంటర్నెట్ లో అశ్లీల వీడియోలు, కంటెంట్ తో పాటు సోషల్ మీడియా నుండి చిన్నారులకు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories