Sankranti Holiday Trip : కేవలం రూ.10000 బడ్జెట్ లో హాలిడే ట్రిప్.. చలికాలంలో తప్పకుండా చూడాల్సిన టాప్ 5 స్పాట్స్

Published : Jan 10, 2026, 02:53 PM IST

ఈ సంక్రాంతి సెలవుల్లో తక్కువ బడ్జెట్‌లో ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అయితే కేవలం రూ10,000 లోపు బడ్జెట్‌లోనే అద్భుతమైన వింటర్ ట్రిప్ ప్లాన్ చేయొచ్చు... అలాంటి ప్రాంతాలగురించి ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
16
చలికాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలివే..

Sankranti Holiday Trip : పిల్లలకు సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి... ఇవి ముగిస్తే ఇక సమ్మర్ వరకు పెద్దగా హాలిడేస్ ఉండవు. ఈ సెలవులు ముగియగానే పరీక్షల హడావిడి మొదలవుతుంది... పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతూ చదువుల మాయలో పడతారు. వారు ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే ఇప్పుడు మైండ్ రిలాక్స్ కావాల్సిందే... ఇందుకోసం సంక్రాంతి పండగవేళ హాయిగా హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకొండి. దీనివల్ల మీ పిల్లలే కాదు మీరు కూడా వర్క్ ప్రెషర్ నుండి ఉపశమనం పొందవచ్చు.

ఈ సంక్రాంతి సెలవుల్లో మీ పిల్లలను ఊరికే ఇంట్లో కూర్చోబెట్టకుండా లోబడ్జెట్ లో మంచి టూర్ ప్లాన్స్ ఉన్నాయి. కేవలం రూ10,000 బడ్జెట్‌లో అద్భుతమైన వింటర్ ట్రిప్ ప్లాన్ చేయండి... దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చుట్టిరండి. జైపూర్, రిషికేశ్, మౌంట్ అబూ, అమృత్‌సర్, అల్మోరా లాంటి 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రదేశాలు చలికాలంలో తిరగడానికి చాలా బాగుంటాయి.

26
1. జైపూర్

రాజస్థాన్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాష్ట్రం.. ఎండాకాలంలో ఈ రాష్ట్రంలో పర్యటించడం చాలా కష్టం. అందుకే చలికాలంలో జైపూర్ తిరగడానికి చాలా బాగుంటుంది. ఆమేర్ కోట, హవా మహల్, సిటీ ప్యాలెస్, లోకల్ బజార్లు మీకు రాయల్ ఫీల్ ఇస్తాయి. బడ్జెట్ హోటల్, స్ట్రీట్ ఫుడ్‌తో ఈ ట్రిప్ 10 వేలలోపే పూర్తవుతుంది.

36
2. రిషికేశ్

ప్రశాంతతతో పాటు కొద్దిగా అడ్వెంచర్ కావాలంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ బెస్ట్. గంగా హారతి, లక్ష్మణ్ ఝూలా, కేఫ్ కల్చర్, యోగా, రివర్ రాప్టింగ్ ఇక్కడ ప్రత్యేకం. చలికాలంలో రద్దీ తక్కువగా ఉంటుంది... కాబట్టి తక్కువ ఖర్చుతో ట్రిప్ పూర్తిచేయవచ్చు.

46
3. అమృత్‌సర్

గోల్డెన్ టెంపుల్, జలియన్‌వాలా బాగ్, వాఘా బోర్డర్‌... పంజాబ్ లోని అమృత్‌సర్ ట్రిప్ చిన్నదైనా గుర్తుండిపోతుంది. చలికాలంలో ఇక్కడి వాతావరణం తిరగడానికి బాగుంటుంది. లోకల్ ధాబాల్లో భోజనం ట్రిప్‌ను స్పెషల్ చేస్తుంది.

56
4. అల్మోరా

మీకు ప్రశాంతత, ప్రకృతి ఇష్టమైతే ఉత్తరా ఖండ్ లోని అల్మోరా మంచి ఆప్షన్. మంచుతో కప్పిన పర్వతాలు, స్థానిక సంస్కృతి, తక్కువ రద్దీ బడ్జెట్ ప్రయాణికులను ఈ ప్రాంతాన్ని సందర్శించేలా చేస్తున్నారు. ఈ హిమాలయన్ కొండల్లో సూర్యోదయం, సూర్యస్తమనం మరింత అద్భుతంగా ఉంటుంది. బస్సు, షేర్డ్ ట్యాక్సీలతో ఖర్చు తగ్గుతుంది.

66
5. మౌంట్ అబూ

రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబూ చలికాలంలో చాలా అందంగా ఉంటుంది. నక్కీ సరస్సు, దిల్వారా జైన దేవాలయం, సన్‌సెట్ పాయింట్ చూడొచ్చు. ఆఫ్-సీజన్ కాబట్టి హోటళ్లు, ప్రయాణం చౌకగా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories