Hasina Death Sentence: మా అమ్మకు మరణశిక్ష తప్పకపోవచ్చు, భారత్ పైనే భారమంతా

Published : Nov 17, 2025, 01:23 PM IST

Hasina Death Sentence:  బంగ్లాదేశల్ లో షేక్ హసీనాకు మరణ శిక్ష పడే అవకాశం ఉందని ఆమె కొడుకు సజీబ్ వాజెద్ జాయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  జూలై మారణహోమం కేసులో షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం శిక్ష ఖరారు చేయనుంది.  

PREV
15
శిక్షకు భయపడను

బంగ్లాదేశ్ లో అల్లర్లు మళ్లీ భగ్గుమన్నాయి.ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. వీటిపై ఈరోజు నవంబర్ 17న తీర్పు రానుంది. దీనివల్ల ఢాకాలో హై అలెర్ట్ విధించారు. హసీనా కొడుకు సాజిబ్ వాజేద్ స్పందించారు. అతను ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్ లో నివాసం ఉంటున్నారు. ఆయన ఈ రోజు తీర్పుపై ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు షేక్ హసీనా కూడా ఓ ఆడియో సందేశాన్ని తమ పార్టీ వెబ్ సైట్లో పెట్టారు. దాడులు, కేసులు కొత్తవి కావు, నాకు ఏ శిక్ష వేసినా భయపడకండి. ఇది దేవుడు ఇచ్చిన జీవితం. ఏదో ఒక రోజు మరణించాల్సిందే... అని సందేశంలో చెప్పుకొచ్చింది.

25
మా అమ్మకు ఉరితప్పదు

ఇక హసీనా కొడుకు మాట్లాడుతూ.. మా అమ్మపై పెట్టిన కేసుల్లో వచ్చే తీర్పు ఎలా వస్తుందో నాకు తెలుసు. ఈరోజు రాబోయే తీర్పును ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు. ఆమెను అన్ని కేసుల్లోనూ దోషిగానే తేలుస్తారు. మా అమ్మకు మరణ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కానీ నా తల్లిని ఏం చేయగలరు? ఆమె భారత్ సుక్షితంగా ఉంది కదా అంటూ వాజేద్ అన్నారు. భారత్ పై ఉన్న నమ్మకాన్ని ఆయన పరోక్షంగా నొక్కి చెప్పారు. ఇండియా హసీనాను కాపాడుతుందని, దేశం నుంచి బయటికి పంపదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

35
భారత్‌పై నమ్మకం

గత ఏడాది షేక్ హసీనా ఊహించని రీతిలో బంగాదేశ్ ను విడిచిపెట్టారు. భారత్ హసీనాకు ఆశ్రయం కల్పించింది. ఆమె ఢిల్లీలోనే ఒక రహస్య ప్రదేశం నివసిస్తున్నారు. అప్పుడప్పుడు ఇంటర్య్యూలు కూడా ఇస్తున్నారు. కానీ ఆమె అడ్రస్ మాత్రం ఎవరికీ తెలియదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రం మాట్లాడుతున్నారు. అప్పట్నించి ఆమె సురక్షితంగా ఇండియాలో నివసిస్తోంది. మన ప్రభుత్వం కూడ ఆమెకు రక్షణ కల్పిస్తోంది. అందుకే హసీనా కొడుకు భారత్ కాపాడుతుందనే నమ్మకాన్ని వ్యక్తి చేశాడు.

45
అవామీ లీగ్ నిషేధంపై..

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. కానీ అంతకుముందే హసీనాకు చెందిన పార్టీ అవామీ లీగ్‌ పై నిషేధం విధించారు.  దీనిపై కూడా వాజేద్ స్పందించారు. 'అవామీ లీగ్ లేకుండా బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనివ్వం. మా ఉద్యమం రోజురోజుకూ బలపడుతోంది. ఈ పార్టీ మళ్లీ చిగురిస్తుంది' అని ఆశాభావం వ్యక్తం చేశారు.

55
అంతర్జాతీయ జోక్యం కావాలి

తన తల్లి కేసులు విషయంలో, ఆమెకు విధించే శిక్షల అంశంలో అంతర్జాతీయ దేశాలు జోక్యం చేసుకోవాలని వాజేద్ డిమాండ్ చేశారు. అలా జోక్యం చేసుకోకపోతే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో హింస మరింత పెరుగుతుందని అన్నారు. బంగ్లాదేశ్ ఎన్నికలకు తానూ, తన పార్టీ అడ్డుగా నిలుస్తామని చెప్పారు. అయితే అవామీ లీగ్‌ పార్టీ పై నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన తమకు లేదని బంగ్లాదేశ్ అధ్యక్షుడు యూనస్ చెబుతున్నారు. ఈ లోపే హసీనాపై ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories