బిహార్ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ పార్టీ హ‌వా.. ఏకంగా కాంగ్రెస్‌కే షాక్

Published : Nov 14, 2025, 07:00 PM IST

Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి అధికార కూటమి హవా సాగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన ఏఐఎమ్ఐఎమ్ పార్టీ హ‌వా చూపించింది. 

PREV
15
ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్ల విచ్ఛిన్నం

బిహార్ సీమాంచల్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గాల్లో, AIMIM మళ్లీ బలంగా ఉనికి చూపింది. ఈ పార్టీలోని అభ్యర్థులు పోటీ చేయడంతో, మహాగఠ్‌బంధన్ (MGB) ఓట్లు చీలిపోయాయి. ఫలితంగా, NDAకి ల‌బ్ధిచేకూరింది. 2020లోలాగే, AIMIM వచ్చి ప్రతిపక్ష ఓట్లను చీల్చడం ఈసారి కూడా కనిపించింది. ఈసారి ప‌తంగి పార్టీ 5 సీట్లు సొంతం చేసుకుంది. కాగా కాంగ్రెస్ కేవ‌లం 6 సీట్ల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మనార్హం.

25
25 మంది రంగంలోకి

ఈసారి AIMIM మొత్తం 25 అభ్యర్థులను రంగంలోకి దించింది. వీరిలో ఎక్కువ మంది సీమాంచల్ ప్రాంతంలోనే పోటీ చేశారు. ముస్లింలు 40% కంటే ఎక్కువగా ఉన్న 9 సీట్లలో పార్టీ 5 సీట్లు గెలుచుకుంది. ఈ విజ‌యాల‌న్నీ MGB అభ్య‌ర్థుల‌పైనే కావ‌డం విశేషం. ఇలాంటి ముస్లిం కేంద్రిత ప్రాంతాల్లో, కాంగ్రెస్ ఒక్క కిషనగంజ్ సీటు మాత్రమే కాపాడుకుంది. RJD, CPI(ML) వంటి పార్టీలు ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. AIMIM పోటీ వల్ల, ప్రణ్‌పూర్ లో BJPకి లాభం జ‌రిగింది. అదే విధంగా బలరాంపూర్ లో LJP(RV)కి లాభం చేకూరింది.

35
25-40% ముస్లిం జనాభా ఉన్న సీట్లలో NDA ఆధిపత్యం

ముస్లింలు తక్కువ శాతంలో ఉన్న (25%–40%) స్థానాల్లో NDA దాదాపు ఆధిపత్యాన్ని చూపింది. 13 సీట్లలో NDA 12 సీట్లు గెలుచుకుంది. MGB తరపున RJD ఒక్క సీటు మాత్రమే సాధించింది. కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలు ఎక్కడా విజయం నమోదు చేయలేకపోయాయి. ఇది NDA కూటమి మిశ్రమ ఓటర్లను బలంగా కలుపుకుని వెళ్లిందని సూచిస్తోంది.

45
AIMIM ఓట్ల శాతం MGBకి ఎలా నష్టం చేసింది?

AIMIM తక్కువ సీట్లు గెలిచినా, ఓట్ల శాతం త‌క్కువ‌గా ఉన్నా కొన్ని స్థానాల్లో మాత్రం ప్ర‌భావం చూపింది 9 నియోజకవర్గాల్లో పార్టీ 15% కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. మ‌రికొన్ని 8 చోట్ల 5%–15% మధ్య ఓట్లు తెచ్చుకుంది. స్వ‌ల్ప‌మే అయినా ఈ ఓట్లు ప్ర‌తిప‌క్షం నుంచి వెళ్ల‌డం MGBకి నష్టం చేసింది.

55
ముస్లిం ప్రతినిధిత్వంపై AIMIM ప్రచారం ప్రభావం

AIMIM తమ ప్రచారంలో రెండు విషయాలు బలంగా ప్రస్తావించింది:

MGB ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదన్న ఆరోపణ

తమ పార్టీ మాత్రమే మైనారిటీల సమస్యలను నేరుగా ముందుకు తెస్తుందన్న భావన

ఈ వాదనలు సీమాంచల్‌లోని కొంతమందిని ఆకర్షించాయి. 2020 తర్వాత AIMIM అక్కడ బలంగా పనిచేయడం కూడా దీనికి కారణంగా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories