బీహార్ ఎన్నికల దెబ్బ.. ప్రశాంత్ కిషోర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? వీడియో వైరల్

Published : Nov 14, 2025, 07:14 PM IST

Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ (పీకే) ప్రయోగం ఫెయిల్ అయింది. ఆయన జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. గతంలో ఆయన జేడీయూ (JDU) 25 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కామెంట్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

PREV
15
జీరో సీట్లు ! బీహార్‌ ఎన్నికల్లో పీకేకు షాక్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2025 లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘోర ఓటమి చవిచూశారు. ఆయన జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాలు, సామాజిక, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్క సీటు సాధించలేదు. ఇది పీకే రాజకీయ లెగసీకి ఎండ్ సిగ్నల్? అనే చర్చ మధ్య ఒక వీడియో వైరల్ గా మారింది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ చేసిన ఆ కామెంట్స్ మరో కొత్త చర్చకు దారి తీశాయి.

25
జేడీయూ 25 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానన్న పీకే.. ఇప్పుడు ఏమంటారు?

నితీష్ కుమార్ జేడీయూ పార్టీ 25 కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే తాను రాజకీయాలు వదిలివేస్తానని ప్రశాంత్ కిషోర్ గతంలో చేసిన ఒక పాత వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన మద్దతుదారులు, విమర్శకుల నుండి దీనిపై స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘోర పరాజయం తర్వాత కిషోర్ నిజంగా రాజకీయాలు వదిలివేస్తారా అని సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నిస్తున్నారు.

35
జన్ సురాజ్ పార్టీ ఎందుకు విఫలమైంది?

జన్ సురాజ్ పార్టీ ఘోరంగా విఫలం కావడం పై రాజకీయ విశ్లేషకులు పలు కీలక అంశాలను ప్రప్తావిస్తున్నారు. ప్రాథమికంగా తేజస్వి యాదవ్ వంటి తమను తాము నిరూపించుకున్న నేతలను సవాల్ చేయడం, పీఆర్ కమ్యూనికేషన్, క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా వ్యవహరించడం, నాయకత్వం ప్రత్యక్షంగా పోటీ చేయకపోవడం వల్ల స్థానిక స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అలాగే, టికెట్ పంపిణీ విషయం కూడా ఆ పార్టీని దెబ్బకొట్టిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

45
దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కానీ, సొంతరాష్ట్రంలో గెలవలేకపోయిన పీకే

ఇదివరకు ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు వ్యూహకర్తగా ఉండి విజయాలు అందించారు. 2014 లోక్‌సభ ప్రచారంలో నరేంద్ర మోదీ కోసం భారతీయ జనతా పార్టీ (BJP)తో (I-PAC వ్యవస్థాపక సంస్థ) పనిచేశారు.

2015లో ఆయన జనతాదళ్ (యునైటెడ్)తో కలిసి పనిచేసి నితీష్ కుమార్ గెలవడానికి సహాయం చేశారు. ఆ తర్వాత ఆయన జేడీయూలో చేరి ఉపాధ్యక్షుడిగా అయ్యారు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC)తో పనిచేసి కెప్టెన్ అమరీందర్ సింగ్ గెలవడానికి సహాయం చేశారు. 2017 ఉత్తరప్రదేశ్ ప్రచారంలో ఆయన భారీ పరాజయాన్ని చవిచూశారు.

2021లో ఆయన పశ్చిమ బెంగాల్ టీఎంసీతో పనిచేసి మమతా బెనర్జీ గెలవడానికి సహాయం చేశారు. 2019లో తనదైన వ్యూహాలు రూపొందించి వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్ మోహన్ రెడ్డి భారీ విజయంలో కీలకపాత్ర పోషించారు. 2020లో ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పనిచేశారు. 2021లో ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా రూపొందించి స్టాలిన్ తిరిగి అధికారంలోకి రావడానికి సహాయం చేశారు. వ్యూహకర్తగా పేకేకు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, ప్రత్యక్ష రాజకీయాల్లో అదే గుర్తింపు పనిచేయదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

55
ప్రశాంత్ కిషోర్ భవిష్యత్ ఏంటి?

ఒక ఎన్నికలో ఓటమి వచ్చినా రాజకీయాల్లో మళ్లీ గెలుపు అవకాశాలు ఉంటాయని చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. శిక్షణ, క్షేత్రస్థాయి నేతల పెంపు, కమ్యూనికేషన్ పద్ధతులలో మార్పులు చేస్తే రానున్న స్థానిక లేదా రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో పీకేను మళ్లీ చూడవచ్చు. అయితే, జేడీయూ 25 సీట్లు సాధిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి పోటిలికట్ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆయనను ఇకపై వ్యూహకర్తగా చూడవచ్చు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి !

Read more Photos on
click me!

Recommended Stories