26/11 ఉగ్రదాడి వేళ దతే ధైర్యం :
2008 నవంబర్ 26 రాత్రి ముంబై ఉగ్రవాద దాడులతో అతలాకుతలమైనప్పుడు ముంబై అదనపు పోలీసు కమిషనర్ (సెంట్రల్ జోన్) సదానంద్ దాతే ఉన్నారు. ఆయన తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదులను ఎదుర్కొన్నాడు. మలబార్ హిల్‌లోని తన ఇంటి నుండి బయలుదేరిన ఆయన నేరుగా చత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళాడు. దారిలోని ఒక పోలీస్ స్టేషన్ నుండి 6 పోలీసుల బృందాన్ని వెంటపెట్టుకుని కామా ఆసుపత్రికి బయలుదేరాడు.
దాతే టీమ్ చేరుకునేటప్పటికే కామా ఆసుపత్రిలో ఉగ్రవాదులు ఉన్నారు. దీంతో ఉగ్రవాదులను నిలువరించేందుకు ముందుకు కదిలిన దాతేకు కేవలం 3 అడుగుల దూరంలో ఒక గ్రెనేడ్ పేలింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంలోకి చిన్న ముక్కలు దూసుకెళ్లాయి.... అయినా వెనకడుగు వేయకుండా ముందుకు కదిలారు. ఈ క్రమంలోనే అతని సహచరులలో ఒకరైన ఎస్సై ప్రకాష్ మోర్ అమరుడయ్యాడు
26/11 దాడులను ధైర్యంగా ఎదుర్కొన్న సదానంద్ దాతే పేరు ధైర్యసాహసాలకు చిహ్నంగా నమోదు చేయబడింది. ఆ సమయంలో ఆయన ముంబై పోలీస్‌లో అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ జోన్) పదవిలో ఉన్నారు. దాడి జరిగినప్పుడు, అతను ఆలస్యం చేయకుండా తన కర్తవ్యాన్ని అర్థం చేసుకుని యుద్ధభూమిలోకి దూకాడు.