PM Kisan Scheme
PM Kisan Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశంలోని రైతులకి ఆర్థికంగా సహాయం చేస్తుంది. రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం రూ.6000 భారత ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫిబ్రవరి 24, 2025న 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 19వ విడతగా రూ.22,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే మీకు ఇంకా ఈ కిసాన్ యోజన డబ్బులు పడలేవా... ఇందుకు కారణమేంటో తెలుసుకొండి. వెంటనే సమస్యను పరిష్కరించుకుని మీ డబ్బులను పొందండి.
PM Kisan Samman Nidhi
మీకు పీఎం కిసాన్ డబ్బులు రాకపోడానికి ఇవే కారణమే ఉండొచ్చు :
1. ఈ-కేవైసీ సమస్య : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లాభం పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. మీరు ఇంకా ఈ-కేవైసీ చేయకపోయినా లేదా మీ సమాచారం తప్పుగా ఉన్నా అకౌంట్లో డబ్బులు పడవు.
2. బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ : ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ ను లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇలా బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వొచ్చు. ఇది మీకు కిసాన్ డబ్బులు పడకపోడానికి కారణం కావచ్చు.
3. డీబీటీ సదుపాయం లేకపోవడం : మీ బ్యాంక్ ఖాతాలో డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) సేవ యాక్టివ్ గా లేకపోతే డబ్బు ట్రాన్స్ఫర్ కాదు. అంటే ఇలా ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకే డబ్బులు అందించే పథకాలను డిబిటి తప్పనిసరి. కాబట్టి మీ అకౌంట్ లో డిబిటి యాక్టివ్ గా ఉందో లేదో చూసుకొండి.
4. భూమి ధృవీకరణ పూర్తి కాకపోవడం : చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు భూయాజమాన్య అర్హత కోసం భూమి ధృవీకరణ తప్పనిసరి చేశారు. ఇది పూర్తికాకపోవడం కూడా పీఎం కిసాన్ డబ్బులు పడకపోడానికి కారణం కావచ్చు.
5. వివరాలు అప్డేట్ చేయకపోవడం : బ్యాంక్ లేదా ఆధార్ సమాచారంలో మార్పులు, అప్డేట్ చేయకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వివరాలను సరిచూసుకొండి.
ఇలా మీకు పిఎం కిసాన్ డబ్బులు పడకపోడానికి ఏదయినా కారణం కావచ్చు. అదేంటో మీరే కనుక్కోవాలి. ఆ సమస్యను పరిష్కరించుకున్నారో మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు నష్టపోతారు.
PM Kisan Scheme
పీఎం కిసాన్ యోజన ఫిర్యాదు ఎక్కడ, ఎలా చేయాలి?
మీకు ఇంకా పీఎం కిసాన్ యోజన 19వ విడత డబ్బు బ్యాంక్ ఖాతాలో పడకపోతే కంగారు పడకండి. మీరు ఫిర్యాదు చేయొచ్చు. టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ 011-23381092 లేదంటే ఈమెయిల్ pmkisan-ict@gov.in మీకు ఉపయోగపడతాయి.
ఇప్పుడు రైతుల సహాయం కోసం పీఎం కిసాన్ ఈ-మిత్ర అనే ఏఐ చాట్బాట్ ను కూడా ప్రారంభించారు. ఇది మీ ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తుంది, సమాచారం పొందే ప్రక్రియను సులభతరం చేస్తుంది.
పిఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
1. ముందుగా pmkisan.gov.in వెబ్ సైట్ కు వెళ్లండి.
2. హోమ్ పేజీలో 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. మీ రిజిస్ట్రేషన్ ఐడీని నమోదు చేసి "Get OTP" బటన్ పై నొక్కండి.
4. ఓటీపీ నమోదు చేయగానే మీ పీఎం కిసాన్ స్టేటస్ పరిస్థితి కనిపిస్తుంది.