భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఆయన కుమారుడు, యంగ్ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ బుధవారం (ఆగస్టు 13, 2025న) ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నాడు.
అర్జున్ తనకు కాబోయే జీవిత భాగస్వామిగా ముంబైకి చెందిన ప్రసిద్ధ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌ను ఎంచుకున్నారు. ఈ వేడుకకు రెండు కుటుంబాల సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అయితే, ఈ వార్తలపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
DID YOU KNOW ?
అర్జున్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతున్నారు. దేశవాళీ క్రికెట్ లో గోవా జట్టు తరఫున ఆడుతున్నారు.
25
ఎవరీ సానియా చందోక్?
సానియా చందోక్ ముంబైలోని ఘాయ్ కుటుంబానికి వారసురాలు. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నది. ‘Mr. Paws Pet Spa & Store’ అనే పెట్ కేర్ బ్రాండ్‌ను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తోంది.
ఘాయ్ కుటుంబం హాస్పిటాలిటీ, ఫుడ్ రంగాల్లో బలమైన స్థానం కలిగి ఉంది. ఇంటర్‌కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ, బాస్కిన్ రాబిన్స్ వంటి బ్రాండ్లు వీరి ఆధీనంలో ఉన్నాయి.
35
అర్జున్ టెండూల్కర్ క్రికెట్ ప్రయాణం
25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ తన తండ్రి సచిన్ లాగా బ్యాట్స్‌మన్ కాకుండా, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ఆల్‌రౌండర్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. 2020-21లో ముంబై తరఫున హర్యానాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.
తర్వాత 2022-23లో గోవా తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 17 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 532 పరుగులు, 37 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున 5 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు తీశాడు.
అర్జున్ టెండూల్కర్ ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే గత సీజన్‌లో ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయినప్పటికీ తన బౌలింగ్, ఆల్‌రౌండర్ నైపుణ్యాలతో జట్టుకు ఉపయోగపడే ఆటగాడిగా ఎదుగుతున్నాడు.
55
అర్జున్ టెండూల్కర్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
నిశ్చితార్థం వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు, క్రికెట్ ప్రేమికులు అర్జున్, సానియా జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టెండూల్కర్ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వివరాలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది.