Rashmika Mandanna: నయనతారకు షాక్ ఇచ్చిన నేషనల్ క్రష్, ఒక్క సినిమాకు రష్మిక ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?

Published : Jun 01, 2026, 05:06 PM IST

రెమ్యునరేషన్ విషయంలో స్టార్ హీరోయిన్లకు షాక్ ఇస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో పెళ్లి తరువాత పారితోషికం మరింతగా పెంచేసిందట. ఇంతకీ ఒక్క సినిమాకు ఆమె ఎంత వసూలు చేస్తుందో తెలుసా?

PREV
15
పెళ్లి తరువాత పెరిగిన రష్మిక జోరు..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతుంది రష్మిక. ఇటు సౌత్ అటు బాలీవుడ్ పాన్ ఇండియా వైడ్ గా రష్మిక మందన్న దూసుకుపోతోంది. ఏహీరోయిన్ అయినా.. పెళ్లి తరువాత కాస్త జోరు తగ్గుంది. హీరోయిన్ గా అవకాశాలు కూడా తగ్గుతాయి. కానీ రష్మికకు మాత్రం పెళ్లి తరువాత మరింత కలిసివస్తోంది. రీసెంట్ గా ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు సమాచారం. రష్మిక, పెళ్లి తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని అదే జోరుతో కొనసాగిస్తోంది.

25
టాలీవుడ్, బాలీవుడ్ లో బిజీ బిజీ..

పెళ్ళి తరువాత చాలా మంది హీరోయిన్లు కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ రష్మిక మాత్రం అలాంటి బ్రేక్ తీసుకోకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ తన మార్కెట్‌ను మరింత పెంచుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో ‘రణబాలి’, ‘మైసా’ సినిమాల్లో నటిస్తున్న రష్మిక, హిందీలో ‘కాక్‌టెయిల్ 2’ వంటి భారీ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ఈ సినిమాల ద్వారా ఆమెకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

35
ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్..?

ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ప్రస్తుతం రష్మికకు డిమాండ్ భారీ స్థాయిలో ఉంది. పెళ్లి తరువాత రష్మిక రెమ్యునరేషన్‌ భారీగా పెరిగినట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగులో ఒక్కో సినిమాకు 8 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న రష్మిక మందన్నా..బాలీవుడ్‌లో మాత్రం మూవీకి 15 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న విడుదల కానున్న ‘కాక్‌టెయిల్ 2’ సినిమా కోసం రష్మిక ఏకంగా రూ. 15 కోట్ల పారితోషికం అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

45
నయనతారకు షాక్ ఇచ్చిన రష్మిక..

సౌత్ లో సీనియర్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. నయనతార, త్రిష లాంటి తారలు.. 40 ఏళ్లు దాటినా మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నారు. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఈక్రమంలో రష్మిక మందన్న వారికి కూడా షాక్ ఇస్తూ.. భారీ రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇక ప్రస్తుతం రష్మిక నటిస్తోన్న సినిమాలో సీనియర్ హీరోయిన్ కృతి సనన్‌కు సమానంగా, జూనియర్ అయిన రష్మికకు కూడా రూ. 15 కోట్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

55
ఒక్కో మెట్టు ఎక్కుతూ..

కన్నడ సినీ పరిశ్రమ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన రష్మిక మందన్న, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం ‘పుష్ప’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అలాగే గత ఏడాది విడుదలైన ‘ఛావా’ సినిమాతో బాలీవుడ్ లో కూడా రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ విజయాలు, పెరుగుతున్న క్రేజ్ కారణంగా ప్రస్తుతం బాలీవుడ్‌లో మిడ్-రేంజ్ హీరోలకు సమానంగా రష్మిక పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories