ఇవాళ్టి ( జూన్ 1) నుంచి ఎల్పీజీ, యూపీఐ, ఏటీఎం లావాదేవీలు, ఆదాయపు పన్నుకు సంబంధించి పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు సామాన్యుల రోజువారి ఖర్చులతో పాటు, డిజిటల్ లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపుతాయి.
జూన్ 1 నుంచి దేశంలోని పలు కీలక సేవల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వంటగది ఖర్చుల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు ఈ మార్పులు సామాన్యుల రోజువారీ జీవితం, నెలవారీ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే ఈ రోజు (సోమవారం) నుంచి అమలవుతున్న ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
26
ఎల్పీజీ కనెక్షన్ కట్..
ఇకపై పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ ఉన్న ఇళ్లకు ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పు చేశారు. కొత్త రూల్ ప్రకారం.. పీఎన్‌జీ కనెక్షన్ యాక్టివేట్ అయిన 30 రోజుల్లోగా పాత ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్‌ను సరెండర్ చేయాలి. అయితే ఇండేన్, భారత్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీలు 'కనెక్షన్ ట్రాన్స్‌ఫర్ వోచర్' విధానాన్ని తెచ్చాయి. దీని ద్వారా భవిష్యత్తులో మళ్లీ ఎల్పీజీ కనెక్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.
36
ఎల్పిజి సిలిండర్ ధరలు పెంపు
ప్రతి నెలా మాదిరిగానే ఎల్పీజీ, కమర్షియల్ సిలిండర్ల ధరల సవరణ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఎల్పిజి సిలిండర్ ధరలు పెరిగాయి.. దీంతో ప్రజలపై భారం పడుతోంది. తాజాగా మరోసారి కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి.. నేటి నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.52 పెరిగింది.. దీని ధర రూ.3,367 కి చేరింది. ఇక ఢిల్లీలో రూ.42 పెరిగి రూ.3,113.50... కోల్‌కతాలో రూ.3,255.50 కి చేరింది.
5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ పైనా రూ.11 పెరిగింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్రం ప్రకటించింది. అంటే సామాన్యులపై భారం లేదన్నమాట. గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ లో ఏవైనా మార్పుచేర్పులు ఉండవచ్చు.
డిజిటల్ భద్రతను పెంచేందుకు యూపీఐ లావాదేవీల్లో కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకొచ్చారు. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్స్‌లో డబ్బు పంపే ముందు, అవతలి వ్యక్తి బ్యాంకులో రిజిస్టర్ అయిన అధికారిక పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. తప్పుడు లావాదేవీలు, మోసాలను తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశం.
56
ఏటీఎం రూల్స్..
బ్యాంకింగ్ సేవలలో కూడా కొన్ని మార్పులు అమలవుతున్నాయి. చాలా బ్యాంకులు ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని కఠినంగా అమలు చేయడం ప్రారంభించాయి. పరిమితి దాటితే డబ్బు విత్‌డ్రా చేయడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి సేవలకు అదనపు ఛార్జీలు వసూలు చేయవచ్చు. కొన్ని సడలింపులు ప్రకటించినప్పటికీ, అధిక విలువైన లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా కొనసాగుతుంది.
66
ఆదాయపు పన్ను మార్పులు
ముందుగా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారికి ఈ జూన్ 15 కీలకమైన తేదీ. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఒకేసారి పన్ను కట్టకుండా నాలుగు వాయిదాలలో (జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చి 15 తేదీల్లోగా) ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.