ఇండియా మొత్తంలో రిచ్ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? 1,413 కోట్లతో ఫస్ట్ ప్లేస్ సాధించింది ఎవరు?. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన నివేదికలో వెల్లడించింది. ఇంతకీ నారా చంద్రబాబు, విజయ్ దళపతిల సంగతేంటి?
భారత రాజకీయాల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న డీకే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా అవతరించారు. ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఈ డేటాను విడుదల చేసింది. విశేషం ఏంటంటే, టాప్-3 ధనిక సీఎంలు ముగ్గురూ దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే.
24
డీకే శివకుమార్ ఆస్తి విలువ
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, 'ట్రబుల్ షూటర్'గా పేరుగాంచిన డీకే శివకుమార్ మొత్తం రూ.1,413 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా మొదటి స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల వివరాలు: చరాస్తులు: రూ.273 కోట్లు, స్థిరాస్తులు (భూములు, భవనాలు): రూ.1,140 కోట్లు, అప్పులు: రూ.265 కోట్లు. 2008లో రూ.75.5 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తి, 2013లో రూ.251 కోట్లకు, 2018లో రూ.840 కోట్లకు పెరిగి, 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రూ.1,413 కోట్లకు చేరింది.
34
రెండో స్థానంలో ఆంధ్రా సీఎం..
ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల ఆస్తులతో దేశంలో రెండో అత్యంత ధనిక సీఎంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు రెండు సార్లు, నవ్యాంధ్రకు రెండు సార్లు సీఎంగా చేశారు బాబు. ప్రస్తుతం నాలుగో సారి ముఖ్యమంత్రి గా ఉన్నారు. దేశంలోనే విజన్ ఉన్న సీఎంగా బాబుకు పేరుంది.
అలాగే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సి. జోసెఫ్ విజయ్, రూ.648 కోట్ల ఆస్తులతో (కొన్ని రిపోర్టుల ప్రకారం రూ.624 కోట్లు) మూడో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తులలో రూ.313 కోట్లకు పైగా బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉండటం గమనార్హం.
గతంలో, 2025లో ఏడీఆర్ (ADR) విడుదల చేసిన జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ (రూ.332 కోట్లు), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందుండేవారు. కానీ తాజా రాజకీయ మార్పుల తర్వాత, డీకే శివకుమార్ (కర్ణాటక), చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), విజయ్ (తమిళనాడు) ముగ్గురు దక్షిణాది నేతలే టాప్-3లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.